# The News telugu ## Posts - [అమరావతికి నవా రాయ్‌పూర్ నేర్పుతున్న పాఠమేంటి? Video](https://teluguheadlines.com/nava-raipur-lessons-for-amaravati/) - [అమరావతి - నవారాయ్‌పూర్ రెండు నగరాల అనుకూల, ప్రతికూలతలేంటి?](https://teluguheadlines.com/amaravati-vs-nava-raipur-project/): ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ నగరాల అభివృద్ధి విషయంలో భిన్నమైన అనుభవాలున్నాయి. అభివృద్ధి విషయంలోనే భిన్న పాఠాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తే విజయవాడ వంటి నగరాలను తోసిరాజని విశాఖపట్నం దూసుకుపోయిన తీరు అందుకు ఓ కొలమానం. దేశవ్యాప్తంగా గాంధీనగర్, నవా రాయ్‌పూర్ అనుభవాలున్న సమయంలోనే నోయిడా లాంటివి కూడా మనకి కనిపిస్తాయి. ఇలాంటి అనేక నగరాలను పరిశీలిస్తే అర్థమవుతున్న అంశం ఒక్కటే. ఉపాధి కల్పన, సామాన్యులకు నివాసయోగ్యంగా ఉండే ప్రాంతాలు మాత్రమే అభివృద్ది అయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులన్నీ కునారిల్లిపోతున్నాయి. హైదరాబాద్ కి తోడుగా సైబరాబాద్, ఇప్పటి ఏపీలో వైజాగ్ అభివృద్ధి వెనుక ఇండస్ట్రీస్ పాత్ర అత్యంత కీలకం. అది విస్మరించి ఎన్ని వాదనలు చేసినా ఒట్టి విన్యాసాలుగానే మిగులుతాయి. ఐటీ విస్తృతమవుతున్న దశలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేక వాతావరణం, భౌగోళిక పరిస్థితులు వంటివి అనుకూలాంశాలుగా కలిసివచ్చి సైబరాబాద్ వేగంగా విస్తరించింది. వైజాగ్ లో 1980 దశకం తర్వాత స్టీల్ ప్లాంట్ అందుబాటులోకి రావడం ఆ... - [గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ: అమరావతి కన్నా ముందుగా కట్టిన నవా రాయ్‌పూర్ నేర్పుతున్న పాఠమేంటి?](https://teluguheadlines.com/impressive-infrastructure-is-one-thing-but-without-people-who-will-call-it-capital-city/): దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ మాటలు గుర్తురాక తప్పదు. ఎందుకంటే రాజధాని అంటే అందమైన భవనాలు, అదిరిపోయే రోడ్లు, ఆకట్టుకునే నిర్మాణాలు మాత్రమే కాదని..అక్కడ నివశించే జనాలని పాలకులకు అర్థమయ్యేలా చెబుతున్న పాఠం ఇది. ఎంత అందంగా డిజైన్ చేశామో, ఎంత అద్భుతంగా నిర్మించామో, ఎంత పెద్దమొత్తంలో ఖర్చు చేశామో అన్నది ఏ నగరానికి కొలబద్ధ కాదనే వాస్తవాన్ని చాటుతున్న విషయమిది. దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణానికి చత్తీస్‌ఘడ్‌ శ్రీకారం చుట్టింది. 2 దశాబ్దాలు దాటింది. కానీ ఇంకా కొత్త నగరం పూర్తిరూపు దాల్చలేదు. నయా రాయ్‌పూర్ పేరుతో మొదలై ప్రస్తుతం నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌ గా పేరు మార్చుకున్న రాజధాని నగరానికి దశ, దిశ ఎన్నటికోననే స్పష్టత లేదు. సర్వహంగులు సిద్ధం చేస్తున్నా, జనాలు అటువైపు మొగ్గుచూపడం లేదు. దాంతో రాజధాని వెలవెలబోతోంది. సెలవు రోజులయితే నిర్మానుష్యంగా మారుతోంది. ఏపీలో అమరావతి పేరుతో... - [రాజ్యసభ సీట్లు బీసీ లకి ఇవ్వటంలో తెలుగుదేశంపై పైచెయ సాధించిన జగన్](https://teluguheadlines.com/rajyasabha-seats-for-bcs-from-andhrapradesh/): జగన్ మోహన్ రెడ్డి తన పాలన లో బీసీ లకి రాజ్యసభలో దేశంలో వున్నా అన్ని పార్టీలకన్నా కూడా ఎక్కువుగా బీసీ లకి ప్రాధాన్యత ఇచ్చాడు.గతం లో రాజ్యసభ్య స్థానాలకి ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్నయ్య కి ఇవ్వటంతో పాటు బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, దాదాపు 50 శాతం పైగా బీసీ లకి ఇవ్వటం లో పైచేయి సాధించాడు అని చెప్పాలిసిందే.. ఇకపోతే బీసీలే వెన్నుముక గ ప్రస్థానం ప్రారంభించిన తెలుగు దేశం పార్టీ ఈ దఫా ఎంత మంది బీసీ లకి ప్రాధాన్యత ఇస్తుంది అనేది వేచి చుడాలిసిందే. దాదాపు టీడీపీ కోర్ ఓటు బ్యాంకు అయిన బీసీలని తన వైపు మార్చుకునే ఉద్దేశంలో జగన్ బీసీలకి పెద్ద పీట వెయ్యటమే కాకుండా ఆ దిశగా విజయం కూడా సాధించాడు. ఇప్పుడు రాజకీయ సమీకరణాల నేపథ్యం లో... - [జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు బడ్జెట్లలో నిధులు కేటాయించండి](https://teluguheadlines.com/%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%ae-%e0%b0%aa%e0%b0%a5%e0%b0%95%e0%b0%be/): దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర.. బడ్జెట్లలో అవసరమైన మేరకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను తమ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ద్వారా కోరడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ ఏ జె)ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి తాము కేటాయింపులు కోసం వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నామన్నారు.. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు.. ఆరోగ్య ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా.. పెన్షన్ సదుపాయంలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరపాలన్నారు.. తమ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ద్వారా ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తామన్నారు. కేంద్రానికి జాతీయ జర్నలిస్టుల సంఘము (ఎన్ ఏ జె)తరఫున పాండే.. రాష్ట్రానికి తమ రాష్ట్ర కార్యవర్గం తరఫున తగు ప్రతిపాదనలు చేయనున్నట్లు వీరు చెప్పారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల బస్సు పాసుల కాలపరిమితి... - [చంద్రబాబు మీద వెంకయ్య అనుమానం!](https://teluguheadlines.com/former-vice-president-venkahai-naidu-dobuts-on-chandrababu/): చంద్రబాబు సామర్థ్యం మీద నమ్మకం ఉందని చెబుతూనే తాము కదులుతుండగానే అమరావతి పూర్తి చేయాలని బహిరంగంగానే చెప్పడం ద్వారా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తిగా వ్యాఖ్యానించారు. అమరావతి పనుల మీద ప్రజల్లో ఇప్పటికే సందేహాలున్నాయి. ఇప్పుడు వెంకయ్య కూడా అలాంటి అనుమానాలు రేకెత్తించడం ఏపీ రాజధాని భవితవ్యం మీద సందేహాలు బలపడుతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో - [మెడికల్ కాలేజీల పీపీపీపై చంద్రబాబు ముందుకే, జగన్ వార్నింగ్స్ పనిచేస్తాయా?](https://teluguheadlines.com/ap-medical-colleges-into-ppp-model-by-chancrababu/): ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల అమ్మకానికి పూనుకుంది. టెండర్లు పిలుస్తోంది. పీపీపీ మోడల్ అంటూ ప్రైవేటుపరం చేస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విపక్షం హెచ్చరిస్తున్నా కూటమి సర్కారు పట్టనట్టే ముందుకెళ్తోంది. ఏపీలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇక రావని చాటుతోంది. పూర్తి వివరాలు కింద వీడియోలో - [ఎస్సీలను జనసేన టార్గెట్ చేసిందా, అసలేం జరుగుతోంది?](https://teluguheadlines.com/janasena-targeted-sc-intellectuals-like-jada-sravan-ias-vijaykumar/): ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎస్సీలు, కాపుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు నాటి ఫ్లెక్స్ వివాదం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో ఆర్ఎంపీ మీద దాడి అదే కోవలోకి వస్తుంది. దానికి తోడుగా కైకలూరు దొనపాడు ఎస్సీ పేట మీద జనసేన శ్రేణుల దాడి వివాదంగా మారింది. అదే సమయంలో జనసేన శ్రేణులు పలువురు ఎస్సీ ప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. జడ శ్రవణ్ కుమార్, ఐఏఎస్ విజయ్ కుమార్, పీవీ సునీల్ కుమార్ వంటి వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ నడుస్తోంది. దానికి కారణాలేంటన్నది ఈ వీడియోలో చూడండి - [అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుందా, పనులేమయినా జరుగుతున్నాయా?](https://teluguheadlines.com/amaravati-seed-access-road-progress/): అమరావతిలో రాకపోకలకు కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం ఆరేళ్ల పాటు ఒక్క అడుగు కూడా పడలేదు. ఏపీ రాజధాని నగర నిర్మాణంలో ముఖ్యమైన రోడ్డు పనులు సాగకపోవడంతో సీఎం, చీఫ్‌ జస్టిస్ సహా అంతా అవస్థలు పడ్డారు. కరకట్ట రోడ్డుని ఆశ్రయించక తప్పని స్థితిలో సాగారు. అయితే రైతులు భూములివ్వకపోవడం వల్ల వెంకటపాలెంలో ఆగిన రోడ్డులో చిన్న పాటి కదలిక వచ్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడండి - [అమరావతి మీద చంద్రబాబు స్వరం మారుతోంది..మునిసిపాల్టీ మాత్రమేనట!](https://teluguheadlines.com/chandrababu-will-be-a-small-muncipality/): అమరావతిని సింగపూర్, షాంఘై, టోక్యో తరహాలో నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు వాస్తవంలోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. అమరావతిని 33వేల ఎకరాల్లో నిర్మితే అదో చిన్న మునిసిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం వెల్లడించడం ఆసక్తిగా మారింది. అసలు ఆయనేమన్నారు..ఇప్పుడెందుకు ఇలా అంటున్నారన్నది చర్చనీయాంశం. Full Details In Video Link: - [అమరావతి ఓ చిన్న మునిసిపాల్టీ! అనుమానాలు పెంచిన చంద్రబాబు](https://teluguheadlines.com/chandrababu-sensational-comments-on-amaravati/): అమరావతి నగరంలో ఇప్పటికే ఉన్న భూముల్లో మాత్రమే నిర్మించే ప్రాంతం ఓ చిన్న మునిసిపాలిటీ స్థాయికి మాత్రమే పరిమితమవుతుందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దాని వెనుక అసలు లక్ష్యం ఏంటి, అమరావతి ప్రాంతం మీద అనుమానాలెందుకు బలపడుతున్నాయి. వీడియో లింక్ క్లిక్ చేయండి పూర్తి విశ్లేషణ కోసం - [పులివెందుల ఫలితాల వెనుక అసలేం జరిగింది? ఓటర్ల మనోగతమేంటి? Exclusive Ground Report](https://teluguheadlines.com/pulivendula-zptc-elections-ground-reality/): “Public opinion is everything. With public sentiment, nothing can fail; without it nothing can succeed.” ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని అంతా అంగీకరిస్తారు. కానీ జనాభిప్రాయానికి విలువనివ్వకపోతే ఏమీ సాధించలేమన్న అబ్రహం లింకన్ చెప్పిన మాటలను అధికారం దక్కగానే విస్మరిస్తారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రత్యేకమైనవి. ఏడాది పాలనకి గడువు ఉండగా నిర్వహించిన చిన్న ఎన్నికే అయినప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందనే అంచనా సర్వత్రా ఉంది. అందుకే పులివెందులలో మొన్నటి ఎన్నికలు జరిగిన 6 పంచాయతీలో ద న్యూస్ తెలుగు టీమ్ పర్యటించింది. ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులు, ప్రజల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాదాపు 10.6 వేల మంది ఓటర్లకు గానూ 76.44 శాతం పోలింగ్ జరిగినట్టు వెల్లడించారు. ఫలితాలను బట్టి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,716... - [ఇకపై‌ ఆ విన్యాసాలు కుదరవు..క్రికెట్ లో కొత్త రూల్](https://teluguheadlines.com/new-rule-in-cricket/): వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ దాటి వెళ్లి..‌మళ్లీ తిరిగి వచ్చి బంతులు పడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి క్యాచ్ తీసుకోవడం చూశాం. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో మైఖెల్ నెసర్ తీసుకున్న క్యాచ్ వివాదాస్పదమైంది. బౌండరీ వద్ద బంతిని క్యాచ్ చేసిన అనంతరం దాన్ని గాల్లోకి విసిరి లైన్ దాటాడు. ఆ తర్వాత బంతిని పట్టుకునే క్రమంలో అక్కడే గాల్లోకి ఎగిరి బంతిని బౌండరీ లోపలకు వేశాడు.‌అప్పుడు మళ్లీ లోపలకు వచ్చి క్యాచ్ చేశాడు. ఈ... - [ట్రంప్- మస్క్ బంధం చెడింది! 'బ్రొమాన్స్' ముగిసింది!](https://teluguheadlines.com/bromans-relation-ends/): ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్‌కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు మస్క్. అతడో బిలియనీర్.. అతడికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే ట్రంప్‌కు ఇలా మద్దతు ఇస్తాడని ఎవరూ అనుకోలేదు. తప్పకుండా తెరవెనుక బడా ప్లాన్ ఉండే ఉంటుందని అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే.. ట్రంప్ అధ్యక్షుడు కాగానే.. మస్క్‌కు కీలకమైన పోస్టు కట్టబెట్టాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (Doge) అనే విభాగాన్ని ఏర్పాటు చేసి.. దానికి మస్క్‌ను... - [పాకిస్తాన్ ఉగ్రవాద పీచమణచమంటే కరాచీ బేకరీలు, మైసూర్ పాక్ పేర్లు మారుస్తారా?](https://teluguheadlines.com/mysorepak-sweat-name-changed-in-rajastan-after-karachi-bakery-name-in-hyderabad/): ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ పనిబడతారని అంతా ఆశించారు. కానీ భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. పట్టు చిక్కుతున్న దశలో జారవిడిచేసేసింది. అమెరికా ఆదేశాలతో గట్టి ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసింది. వాస్తవానికి సైనిక చర్యకు ముందే పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు దౌత్య యుద్ధం జరగాలి. ప్రపంచమద్ధతు కోరాలి. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుని పలువురిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలించారు. దాని వల్ల ప్రయోజనమెంత అన్నది ప్రశ్నార్థకమే. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. విదేశాంగ విధానంలో ఒకనాడు తృతీయ ప్రపంచదేశాలకు నాయకత్వం వహించిన దశ నుంచి అమెరికాకి ఉపగ్రహం మారి, ఏకంగా ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసే స్థాయికి భారత ప్రధాని రావడంతో అనేక దేశాలు ఇండియాను విశ్వసించడం మానేశాయి. అదే దేశం ఇప్పుడు విశ్వ వినువీధుల్లో ఎదుర్కొంటున్న అసలు సమస్య. ఇలాంటి వైపల్యాన్ని కప్పిపుచ్చేందుకు మధ్యప్రదేశ్... - [సిక్స్ కొట్టినందుకు రూ. 5లక్షలు ఫైన్ కట్టిన అభిషేక్! ఎందుకంటే?](https://teluguheadlines.com/abhishek-sharma-fined-for-hit-a-six-on-car/): ఐపీఎల్ అంటేనే మనీ మెషిన్. ఇటు బీసీసీఐకి.. అటు ప్లేయర్లకు కాసుల పంట. ప్రతీ ఏడాది కోట్లాది రూపాయల సాలరీలు అందుకోవడమే కాకుండా.. గేమ్‌లో రాణిస్తే వివిధ రూపాల్లో డబ్బులు వచ్చి పడతాయి. అత్యధిక సిక్సులు కొట్టినందుకు కూడా ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. కానీ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ అభిషేక్ శర్మ శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన సిక్సుకు రూ.5 లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. లక్నోలోని ఏక్నా స్టేడియంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఒక భారీ సిక్స్ కొట్టాడు. అది కాస్తా.. బౌండరీ వెలుపల డిస్‌ప్లే కోసం పెట్టిన Tata Curvv SUV కారుకు తాకింది. కార్ విండ్ షీల్డ్‌ను ఆ బంతి డ్యామేజ్ చేసింది. దీంతో అభిషేక్ శర్మ రూ.5 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఎందుకీ ఫైన్? బ్యాటర్లు కావాలని కారును డ్యామేజ్ చేయడానికి సిక్సులు కొట్టరు కదా! బౌలర్లు... - [పాకిస్తాన్ కి అదే బలం! మోదీ అంచనా అందుకే తప్పిందా?](https://teluguheadlines.com/china-and-usa-funding-pakistan/): ఒక్కో దేశానికి ఒక్కో బలం ఉంటుంది. పాకిస్తాన్ బలం మాత్రం భౌగోళిక స్వరూపమే. అందులోనూ కీలక దేశాలకు నడుమ ఉండడమే. ఓవైపు ఇండియా, రెండోవైపు చైనా, ఇంకో వైపు ఇరాన్, వాటికి తోడు పూర్వపు సోవియట్ రష్యా కూడా సమీపంలోనే ఉండేది. కనుకనే అమెరికా కన్నేసింది. పాకిస్తాన్ ను ఉపయోగించుకుంది. రష్యాని బెదిరించేందుకు, ఇండియాను కట్టడిచేసేందుకు పాకిస్తాన్ ను వినియోగించుకుది. చివరకు ఇరాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పాలకులను గద్దెదించేందుకు పాకిస్తాన్ కేంద్రంగానే పావులు కదిపింది. కొన్ని విజయాలు కూడా దక్కించుకుంది. కానీ సోవియట్ పతనం తర్వాత పాకిస్తాన్ అవసరం తగ్గింది. కేవలం ఇండియాను నియంత్రించేందుకు మాత్రమే పాకిస్తాన్ అన్నట్టుగా మారింది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ కి అమెరికా సాయం అందింది. కానీ చైనా క్రమంగా బలపడుతూ వస్తున్న క్రమంలో మళ్లీ అమెరికాకి పాకిస్తాన్ చేరువ కాకూడదని చైనా ఆశించింది. తన భూభాగానికి చెంతనే అమెరికా కనుసన్నల్లో సాగే ప్రభుత్వాలు... - [మోదీ నాయకత్వ వైఫల్యం అదే! దీర్ఘకాల నష్టాలు తప్పవు!](https://teluguheadlines.com/america-shocked-india-with-cease-fire-deal-modi-decision-will-create-problems-in-future/): భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ పూర్తిగా దాని ఫలితం దక్కడం లేదు. కవ్వింపు చర్యలు కొనసాగుతుండడం కలవరపరుస్తోంది. దానికి మించి అమెరికా ఆదేశాలను భారత ప్రభుత్వం అనుసరించడం అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది. కాల్పుల విరమణకి పాల్పడిన దేశాల కన్నా ముందే అమెరికా ఈ ప్రకటన చేయడం విస్మయకరంగా మారింది. ట్రంప్ పోస్టులోని కామన్ సెన్స్, ఇంటిలిజెన్స్ వంటి పదాలు అవమానకరంగా కనిపిస్తున్నాయి. అసలింతకీ ఇండియా ఇక్కడి వరకూ ఎందుకొచ్చిందన్నదే ముఖ్య ప్రశ్న. ఉగ్రవాద దాడుల్లో బాధితురాలిగా ఉన్న దేశం ఆఖరికి ఎందుకు చేతులు ముడుచుకోవాల్సి వచ్చిందన్నది ముఖ్యాంశం. మొత్తం ఎపిసోడ్ అంటే ఏప్రిల్ 22 వ తేదీ పెహల్గావ్ ఉదంతంతో మొదలైతే నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతుంది. వ్యూహాత్మక తప్పిదాలు తేటతెల్లమవుతాయి. దౌత్యపరంగా వైఫల్యం కాల్పుల విరమణ తర్వాత అందరూ 1971 గుర్తు చేసుకుంటున్నారు. ఇందిరాగాంధీ తెగువని ప్రదర్శిస్తున్నారు. కాలం మారవచ్చు..నేతలు మారవచ్చు. ఆయుధ... - [పిఠాపురం వర్మ మీద వేటు తప్పదా, పవన్ కళ్యాణ్‌ తో వివాదానికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనా?](https://teluguheadlines.com/pawan-kalyan-serious-on-pithapuram-varma-reactions/): నేరుగా కాకున్నా.. పరోక్షంగానైనా పిఠాపురం వర్మ.. జనసేనానితో యుద్దానికి కాలు దువ్వుతున్నట్టే కన్పిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు.. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కల్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో.. అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్దానికి దిగేటంతటి రేంజీకి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. దాదాపు ఇదే రకమైన అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే వర్మ విషయంలో టీడీపీ అధిష్టానం.. కేడర్లో సాఫ్ట్ కార్నర్ నెమ్మదిగా తగ్గుతోందనే చర్చ మొదలైంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా.. ఒకసారి.. రెండుసార్లు వరకు ఫర్వాలేదు కానీ.. ప్రతి విషయంలోనూ అదే పనిగా పిఠాపురంలో జనసేనను వెంటాడుతూ రాజకీయం చేస్తే.. అధిష్టానం కూడా... - [ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?](https://teluguheadlines.com/reasons-behind-gv-reddy-resignation/): ప్రపంచం బాధను తన బాధగా భావిస్తారని శ్రీ శ్రీ గురించి.. తన బాధను ప్రపంచం బాధగా చూస్తారని కృష్ణశాస్త్రి గురించి సాహితీ లోకంలో ఉన్న టాక్. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుల్లో కొందరు శ్రీ శ్రీలు, ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయినట్టే కన్పిస్తోంది. జీవీ రెడ్డి-దినేష్ కుమార్ ఎపిసోడులో కొందరు శ్రీ శ్రీలుగా మారిపోయారు.. ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా చంద్రబాబు కంటే జీవీ రెడ్డే గ్రేట్ అనే స్థాయిలో కామెంట్లు కూడా చేసేస్తున్నారు. ఇదంతా చూస్తున్న కొందరు సీనియర్ నేతలు వాళ్ల సన్నిహితుల వద్ద ఓ కామెంట్ చేస్తున్నారు.. జీవీ రెడ్డి అంత గొప్పవాడా..? అంటున్నారట. ఈ మొత్తం చర్చ ఎందుకు జరుగుతోందంటే.. ఫైబర్ నెట్ ఎండీగా వ్యవహరించిన దినేష్ కుమార్ తన మాట వినడం లేదని ఫైబర్ నెట్ ఛైర్మనుగా ఉన్న జీవీ రెడ్డికి కోపం వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టారు. ఓ అధికారి... - [విజయసాయిరెడ్డి తీరు విడ్డూరంగా ఉందా, వ్యవహారం తేడాగా ఉందా?](https://teluguheadlines.com/vijaya-saireddy-resignation-accepted-by-rajyasabha-chairman/): వైఎస్సార్సీపీని కీలక నేతలు వీడుతుంటే టీడీపీ సంతోషపడాలి. ప్రత్యర్థి బలహీనపడుతున్నాడని ఆనందించాలి. కానీ ఇప్పుడు పాలక టీడీపీలో కలవరం కనిపిస్తోంది. తాజా పరిణామాల మర్మం తెలియక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆఖరికి టీడీపీ అధినేత కూడా విజయసాయిరెడ్డి రాజీనామా మీద ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు విజయసాయి రెడ్డి మీద విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇదంతా ఆసక్తికర అంశం. వాస్తవానికి టీడీపీ నేతలు సందేహించడానికి తగ్గట్టుగానే సాయిరెడ్డి వైఖరి కనిపిస్తోంది. సహజంగా ఎవరైనా పార్టీని వీడుతుంటే వదిలిపోతున్న పార్టీ నాయకుడి మీద నాలుగు రాళ్లేసే ప్రయత్నం చేస్తారు. అక్కడేమీ బాలేదని, ఆ పార్టీకి అసలు భవితవ్యమే లేదని ఇలాంటి అనేకనేక వ్యాఖ్యలు వినిపించాలి. కానీ విజయసాయిరెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. విస్తృత ప్రజాభిమానం కలిగిన నేతగా కితాబునిచ్చారు. తనలాంటి వాళ్ళు వెయ్యి మంది బయటకు... - [విజయసాయిరెడ్డి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నారా?](https://teluguheadlines.com/vijayasaireddy-turned-to-bjp/): వైఎస్సార్సీపీని వీడిపోయిన విజయసాయిరెడ్డి రేపోమాపో కాషాయ కండువా కప్పుకుంటారు. అది తక్షణమే జరుగుతుందా, కొన్ని నెలల తర్వాత జరుగుతుందా అన్నదే ప్రశ్న. నేరుగా వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరితే తన అభిమానులు జీర్ణించుకునే అవకాశం లేదు కాబట్టి కొంత విరామం తీసుకుని ఆయన మళ్లీ బీజేపీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీని వీడడం ద్వారా ఆపార్టీ కంటే వ్యక్తిగతంగా జగన్ ఎక్కువ నష్టపోతారనడం కూడా నిస్సందేహం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుట్టంతా తెలిసిన ఆడిటర్ హఠాత్తుగా వెళ్లిపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది ఎంతమేరకు అన్నది భవిష్యత్ చెబుతుంది. కానీ విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం రాజకీయంగా తనకు మేలు చేసేందుకే అన్నది సుస్పష్టం. అధికారం లేని దశలో రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికీ ఆ తర్వాత దాని రుచి మరిగిన తర్వాత అంత త్వరగా రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉండదు. అందులోనూ అధికారంలో ఉండగా... - [జగనూ, పవనూ ఇద్దరికీ పాఠం చెప్పిన సినిమా రాజకీయాలు!](https://teluguheadlines.com/kapu-politics-effect-on-game-changer-result/): రాజకీయ పార్టీ లేదా సినిమా ఏదైనా గానీ ఒక కులం, ఒక వర్గం ఆధారంగా సక్సెస్ కొట్టలేవన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయా కులాల అండదండలతో కొంత ఊపు వస్తుంది. పార్టీకయితే పునాది అవుతుంది. సినిమాకయితే ఒకటి రెండు రోజుల వసూళ్లుంటాయి. అంతకుమించి కులాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొణిదెల పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యి ఉండాలి. ఎందుకుంటే కులం కారణంగా రాజకీయాల్లో ఒకరు, సినిమాల్లో ఒకరు దెబ్బతినాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన కారణంగా వైఎస్ జగన్ కి ఎదురుదెబ్బ తగిలింది. కాపులను సమీకరించడంలో పవన్ కళ్యాణ్‌ సక్సెస్ అయ్యారు. కాపు ఓట్లు పూర్తిగా జగన్ వ్యతిరేకంగా మారిపోవడంతో వైఎస్సార్సీపీకి ఊపిరిసలపని పరిస్థితి ఏర్పడింది. గంపగుత్తగా తన ఓట్లను టీడీపీకి మళ్లించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి జగన్ ను కట్టడి చేయగలిగారు. రాజకీయంగా కాపు ఓట్లు దూరం కావడంతో జగన్ అధికారం కోల్పోవాల్సి... - [టీడీపీకి పెద్ద తలనొప్పి సొంత శిబిరం నుంచే! ఏంటి కారణం?](https://teluguheadlines.com/tdp-social-media-reverse-attack-on-government/): ఓ రాజకీయ పార్టీకి మీడియాలో అనుకూల వార్తలు వస్తే.. బాగుంది బాగుందని ఆ పార్టీ అధిష్టానం అనుకుంటుంది. అదే నెగెటీవ్ వార్తలు వస్తే.. ఇదెక్కడి గొడవ రా బాబూ.. అనుకుంటుంది. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలోననే ఆలోచన చేస్తుంది. అలాంటింది.. ఆ రాజకీయ పార్టీ కేడరే మీడియా పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది..? అయితే బ్లాక్ బ్లస్టర్.. లేదా అట్టర్ ప్లాప్ అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఇదే తరహా రాజకీయం కన్పిస్తోంది. కేడర్.. మీడియా పాత్ర పోషించడమనే పాయింట్ పాతదే కదా.. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు. 1994కు ముందు నుంచి కొద్దిగా.. 2004 తర్వాత నుంచి మరింత ఎక్కువగా తెలుగునాట రాజకీయాల్లో ఈ మాట వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు సడెనుగా ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందనే డౌట్ రావచ్చు. కానీ ఈ డౌట్ రావడానికి కారణం లేకపోలేదు. తమ ప్రత్యర్థి పార్టీకి మీడియా సపోర్ట్ ఉందని.. తమకు లేదని..... - [ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?](https://teluguheadlines.com/arogya-sri-stopped-but-health-minister-didnt-respond-yet/): ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు పూనుకున్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ తీరుని తీవ్రంగా నిరసించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన వారికి మూడేళ్ల పాటు ఇంటర్న్ షిప్ చేయాలంటూ పెట్టిన షరతు మీద మండిపడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తీరుని తప్పుబట్టారు. అవన్నీ విద్యార్థులకు, వారి తల్లిందండ్రులకు సంబంధించిన సమస్యలనుకుంటే తాజాగా ప్రజలందరికీ సంబంధించిన విషయంలో... - [రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?](https://teluguheadlines.com/abn-rk-comments-on-chandrababu-for-nara-lokesh/): చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరామర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారాఅసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది. ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి రాశారు. ఏమయ్యింది ఆ వ్యవహారం అన్నది ఎవరికీ పట్టదు. ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ గురించి రాశారు. ఆయన హైదరాబాద్ కేంద్రంగా గానా బజానాతో పాటుగా సెటిల్ మెంట్లు చేస్తున్నారన్నది కథనం. దాని వెనుక అసలు కథ ఏమిటన్నది ఆసక్తికరమే. రెవెన్యూలో ఏదయినా రాధాకృష్ణ సంబంధీకుల వ్యవహారం పెండింగులో ఉందా, లేక మంత్రి మీద ఏదయినా ఒత్తిడి తెచ్చేయత్నమా ఏమిటన్నది చూడాలి. కానీ... - [అచ్చెన్నాయుడి సోదరుడైతే రిటైర్మెంట్ తర్వాత కూడా పోస్టింగ్!](https://teluguheadlines.com/ap-minister-achennaidu-brother-got-psost/): ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి బాబాయ్ అయిన కింజరాపు ప్రభాకర్ కి రిటైర్మెంట్ తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాని మీద ఏమంటుందో మరి జ్యోతి. జ్యోతి రాతలు పక్కన పెడితే రాష్ట్రంలో అనేక మంది తగిన పోస్టింగ్స్ లేవని అవస్థలు పడుతుంటే తాజాగా రిటైర్ అయిన ఏపీ మంత్రి సోదరుడికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన తీరు చర్చనీయాంశమవుతోంది. కింజరాపు ప్రభాకర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్‌ పోలీస్ గా రిటైర్ అయ్యారు. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా అనేకం అందించారు. కానీ ఇప్పుడు ఆయనకు మరికొంత కాలం పాటు అధికారం కట్టబెట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్... - [సాగనంపాల్సింది రోహిత్ నే కాదు, అతడిని కూడా!](https://teluguheadlines.com/team-india-batters-failed-again-in-scg/): టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మను సాగనంపేసింది. కీలకమైన చివరి టెస్టులో ఆయన్ని పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ బుమ్రాకే సారధ్యం దక్కింది. పెర్త్ టెస్టులో గెలుపుబాట పట్టించిన సారధికి చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ రావడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి, సిరీస్ ను డ్రా చేస్తారా అన్నది ఆసక్తికరం. సిరీస్ మధ్యలో కెప్టెన్ ను పక్కన పెట్టడం టీమిండియాలో అరుదైన అంశం. గతంలో 1985లో కపిల్ దేవ్ ను కూడా ఇలానే పక్కన పెట్టిన తీరు పెనుదుమారం రేపింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా రోహిత్ శర్మ తన ఫామ్ లేమి కారణంగా తప్పుకున్నాడంటూ జట్టు యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఓ సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టేసిన వైనం చర్చనీయాంశమవుతోంది. రోహిత్ ను పక్కన పెట్టేసి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మరోసారి పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. ముఖ్యంగా కీలక బ్యాటర్లంతా విఫలమయ్యారు.... - [బాహుబలిని బీట్ చేసిన పుష్ప2! ఇక మిగిలింది ఆ సినిమానే!](https://teluguheadlines.com/allu-arjun-pushpa-breaks-bahubali-records/): ఇండియన్ మువీ ఇండస్ట్రీలో పుష్ప2 కొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. టాలీవుడ్ సత్తాను చాటిచెప్పింది. బాహుబలిని బీట్ చేసి రికార్డ్ కలెక్షన్లు సాధించింది. 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త రికార్డ్ నెలకొల్పింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ మువీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం పుష్ప2 కేవలం దంగల్ తర్వాతి స్థానంలో ఉంది. దేశ సినిమా చరిత్రలో దంగల్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. దానికి 2070 కోట్ల వరకూ వచ్చింది. పుష్ప2 విజయం వెనుక హిందీ బెల్ట్ లో దక్కిన ఆదరణ ప్రధాన కారణం. తెలుగు హీరో నటించిన సినిమా అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల కన్నా బాలీవుడ్ ప్రేక్షకుల్లోనే... - [పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత](https://teluguheadlines.com/un-employees-effect-on-prashanth-kishor/): ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన నేపథ్యం అతనికుంది. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే కి పనిచేసి, తాజాగా అన్నా డీఎంకేతో చేతులు కలిపిన చరిత్ర అతడిది. రాజకీయ వైరిపక్షాల పంచన కూడా చేరి, ఒకరి గుట్టు మరొకరికి అందించే అవకాశవాద నేపథ్యం తనదని విమర్శకుల మాట. తాను ఎవరికి అండగా ఉంటే వారినే గెలిపించగలనని భావించే అతడికి సొంత రాష్ట్రం మాత్రం చుక్కలుచూపిస్తోంది. జనసురాజ్ పేరుతో ప్రారంభించిన సొంత పార్టీలో... - [బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?](https://teluguheadlines.com/ap-govt-proposal-on-godavari-banakacharla/): గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన దేశమంతా వెదికినా ఓ లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ ఒక్కటీ పూర్తయిన దాఖలాలు లేవు. ఆయన గద్దెనెక్కకముందే ప్రారంభించిన పోలవరం వంటివి పూర్తవుతున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అలాంటి దశలో చంద్రబాబు ఏకంగా రూ. 80వేల కోట్ల ప్రతిపాదనతో బడా ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నామంటున్నారు. దేశంలోనే ఇదే పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు.... - [దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?](https://teluguheadlines.com/sc-leader-as-bjp-president/): బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం విషయంలో నరేంద్ర మోదీ- అమిత్ షా ఒక వైపు, ఆర్ఎస్ఎస్ పెద్దలు మరోవైపు ఆలోచిస్తుండడమే ఈ జాప్యానికి కారణమని బహిరంగంగా స్పష్టమవుతోంది. రెండు బృందాల మధ్య ఏకాభిప్రాయం కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దాంతో నియామకం వాయిదా పడుస్తూ వస్తోంది. ఇక వచ్చే ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వస్తే దళిత నేతకు అవకాశం ఉంటుందన్న ప్రచారం మొదలయ్యింది. బీజేపీ... - [స్నికో మీటర్ ముఖ్యమా, డిఫ్లెక్షనా?](https://teluguheadlines.com/jaiswal-out-in-bgt-series/): బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ టెస్టులో టీమిండియా బ్యాటర్ యశశ్వీ జైస్వాల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. స్నికో మీటర్ లో ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోయినా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా, ప్యాట్ కమిన్స్ డీఆర్ఎస్ కోరడంతో దానిని అవుట్ గా నిర్దారించారు. దాని మీద బ్యాటర్ కూడా అభ్యంతరం పెట్టినా అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది. కొందరు అంపైర్లు స్నికో మీటర్ ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోతే నాటౌట్ గా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో కేవలం డిఫ్లెక్షన్ ఆధారంగా షాకిత్ సైకత్ తీసుకున్న నిర్ణయం మీద టీమిండియా మేనేజ్మెంట్ కూడా అసంతృప్తి ప్రదర్శిస్తోంది. సరిగ్గా ఇదే పద్ధతిలో పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో రివర్స్ లో అవుట్ ఇచ్చారు. అప్పట్లో... - [నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?](https://teluguheadlines.com/media-giving-lot-priority-to-nitish-kumar-reddy/): టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ మీడియా ఎవరినైతే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుందో వాళ్లంతా కొద్దికాలానికే జట్టులో స్థానం కోసమే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి అనేక ఉదాహరణలున్నాయి. ఇటీవల కాలంలోనే ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు తిరుగులేని ఉదాహరణలు. శుభ్ మన్ గిల్ కి మీడియా ఇచ్చినంత ప్రాధాన్యత దాదాపుగా ఇటీవల ఎవరికీ దక్కలేదు. పబ్లిసిటీ అంతా ఇంతా... - [చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా](https://teluguheadlines.com/kadapa-constable-letter-to-cm-chandrababu/): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది. తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి రాసిన లేఖ పోలీస్ గ్రూప్ ల్లో వైరల్ అవుతూ, సంబంధిత శాఖ ఉద్యోగుల్లో చర్చనీయాంశమయ్యింది. ఆ లేఖలో ఇలా ఉంది.. సార్ నమస్కారం సార్.సీఎం సార్ గారికి డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి అందరికీ నమస్కారం. సార్ నా పేరు దేవేంద్రారెడ్డి. నేను కడప జిల్లా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను.సార్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 7... - [రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?](https://teluguheadlines.com/revanth-reddy-wants-to-control-tollywood/): ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు సినిమా నటులు ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్ గానే ఉన్నారు. కొన్ని సార్లు బెదిరించి, ఇంకొన్ని సార్లు బుజ్జగించి, అదీకాకపోతే మరికొన్ని సార్లు భయపెట్టి ఏదో మార్గంలో టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని సినీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అనుసరించిన పంథా మనం చూశాం. ఇప్పుడు తెలంగానాణాలో రేవంత్ రెడ్డి... - [చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!](https://teluguheadlines.com/vizag-steel-worker-salaries-in-pending/): వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల మొత్తం అందించబోతున్నట్టు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి హెచ్ డీ కుమార స్వామి ప్రకటించారు. మైసూరు మహరాజా నేతృత్వంలో స్థాపించిన ఈ స్టాల్ ప్లాంట్ కాపాడుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు. అదే సమయంలో లక్షల మందికి జీవనోపాధిగా ఉన్న వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్రం సవతిప్రేమ చూపుతోంది. సొంత గనుల కేటాయింపు లేదు. కనీసం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే ప్యాకేజీ కూడా... - [అల్లు అర్జున్ కి శత్రువులెక్కువయ్యారా? ఈ కేసులో తనకిపోయిందెంత?](https://teluguheadlines.com/allu-arjun-case-effect-on-telangana-politics-and-tollywood/): సమాజంలో ఏ రంగంలో ఎదిగిన వాళ్లయినా ఎదుటి వాళ్లకు ఈర్ష్యగానే ఉంటుంది. అందులోనూ తమ కళ్లెదురుగా ప్రస్థానం మొదలెట్టి, తాము ఊహించని స్థాయికి ఎదిగిపోతుంటే మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అదే కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడు. అంటే అతని కంటే ముందు బాధ్యులు మరో పది మంది ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదుకాని అసలు అంశం ఈ విషయంలో పోలీసులు పాత్ర కూడా ఉంది. అనుమతి లేకుండా థియేటర్ వద్దకు, అది కూడా సీఎం చెప్పినట్టుగా రోడ్ షో చేసుకుంటూ వస్తే అడ్డుకోవాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?. అతని కారుని థియేటర్ లోపలికి వెళ్లేందుకు ఎందుకు అనుమతించాలి? ఇలాంటి సవాలక్ష సందేహాలు ఎదురవుతాయి. అన్నీ కలిపితే పోలీసుల వైఫల్యం కూడా పెద్దదేనని స్పష్టమవుతుంది. వేల మంది వచ్చిన చోట అవసరమైన సంఖ్యలో సిబ్బంది లేరన్నది రూఢీ అవుతుంది.... - [ఏబీఎన్ ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారా?](https://teluguheadlines.com/abn-md-rk-married-a-doctor/): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీగా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అధినేతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండే వేమూరి రాధాకృష్ణ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన రెండో పెళ్లి చుట్టూ చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన పెళ్లి మీద పలు కథనాలు వచ్చాయి. చివరకు పెళ్ళి పూర్తయ్యిందంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏబీఎన్ ఆర్కే భార్య, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేసిన కనకదుర్గ కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆ తర్వాత ఏబీఎన్ ఆర్కే హైదరాబాద్ కే చెందిన ఓ డాక్టర్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్టు సోషల్ మీడియాలో గుప్పుమంది. చివరకు ఆర్కే రెండో పెళ్లి గురించి ఆయన ఇంట్లో వివాదం కూడా మొదలయ్యిందనే రీతిలో కొందరు పోస్టులు చేశారు. అలాంటి వివాదాలన్నింటికీ ముగింపు పలికి ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారనే అంశాన్ని చాటుతూ తెలంగాణా ఆవాజ్ అనే హ్యాండిల్ నుంచి అప్... - [పోలీసులే హద్దులు మీరితే ఎలా? క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ](https://teluguheadlines.com/hyderabad-cp-sorry-to-media/): అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలో పోలీసులు కొందరు చేస్తున్న అతి వివాదాలకు దారితీస్తోంది. అల్లు అర్జున్ ని విలన్ గా చిత్రీకరించాలని సీఎం సంకల్పించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వీరంగం చేసిన ఏసీపీ వంటి వాళ్లు అందులో పావులుగా మారారు. ఆఖరికి సీనియర్ అధికారి, హైదరాబాద్ సీపీ కూడా ఆ క్రమంలో హద్దులు మీరి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సంధ్య థియేటర్‌ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు.సంధ్య థియేటర్‌ వద్ద ఏం జరిగిందో తెలియజేస్తూ నగర పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన దిల్లీ మీడియా మీద కొంత దురుసుగా ప్రవర్తించారు. అవి వైరల్ గా... - [నారా దేవాన్ష్ రికార్డ్, వేగంగా పావులు కదుపుతున్న సీఎం మనవడు](https://teluguheadlines.com/nara-devansh-creates-record-in-chess/): మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. మరో 2రికార్డులు కూడా దేవాన్ష్ సొంతం ఇదిలావుండగా ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా... - [సిబిల్ స్కోర్ వ్యవస్థకు చెక్ పడుతుందా? సామాన్యులకు ఊరట దక్కుతుందా?](https://teluguheadlines.com/supreme-court-respond-on-cibil-score-pil/): బ్యాంక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్, ఏదయినా ఫైనాన్స్ వ్యవహారం చక్కదిద్దాలంటే సిబిల్ స్కోర్. ఇలా ప్రతీదానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టి చాలామందిని వేధిస్తున్న పరిస్థితి కొంతకాలంగా తీవ్రమవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళనతో సతమతమయ్యే మధ్యతరగతి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా సిబిల్ స్కోర్ విషయమై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరింది. ఈ విధానం వల్ల ఈ దేశ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టు గుర్తించింది. సిబిల్ స్కోరు అనేది చట్టవిరుద్ధమైన వ్యవహారమంటూ ఆరోపణలున్నాయి. ఏ బ్యాంకు చట్టంలోనూ, రిజర్వు బ్యాంకు చట్టంలోనూ సిబిల్ స్కోరు తప్పనిసరి అని లేదన్న విషయాన్ని పలువురు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కోర్టులు కూడా ఎక్కడా సిబిల్ స్కోరును లోను ఇవ్వడానికి ఒక షరతుగా చెప్పలేదంటూ గుర్తు చేస్తున్నారు. ఈ సిబిల్ స్కోరును చెక్ బౌన్సులకు ముడిపెట్టి ఎంతోమందికి వేదన,... - [రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!](https://teluguheadlines.com/aap-campaign-with-ai/): వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులను ఎండగట్టేందుకు కూడా ఏఐ తోడ్పాడు అందుకుంటున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో ఏఐ వీడియోల పాత్ర పెరుగుతోంది. తాజాగా దిల్లీ ఎన్నికల్లో ఆప్ మరో అడుగు ముందుకేసింది. దాని ప్రభావంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రభావం తగ్గడంతో పాటుగా ఏఐ వీడియోల కారణంగా ఆర్టిస్టులకు కూడా పని తగ్గుతుందన్న ఆందోళన ఉంది. మరోవైపు ఈ ఏఐ... - [ఆలయ కమిటీల్లో ఆ రెండు కులాలకు చోటు, మరి మిగిలిన వాళ్లేం చేశారు?](https://teluguheadlines.com/brahmin-reservations-in-ap/): ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పాలకమండళ్ల నియామకాలకు సిద్ధమవుతోంది. ఆక్రమంలో కొత్తగా కమిటీల్లో రెండు కులాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించింది. అందులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ దేవాలయ కమిటీల్లో ఆయా ప్రాంతాలను బట్టి కమిటీల్లో చోటు లభిస్తుంది. కులాల వారీగా కేటాయింపులు లేవు. కానీ తొలిసారిగా ఆ రెండు కులాల వారికి చోటు కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ రెండు కులాల వారికి కేటాయించేందుకు తగ్గట్టుగా అదనంగా రెండు పోస్టులు కూడా పెంచుతూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పుడిది ఆసక్తిగా మారుతోంది. అన్ని చోట్లా ఆయా కులాల వారు ఉండకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పల్లెల్లో కొన్నిచోట్ల ఈ కులాల నుంచి ఎవరూ లేకపోతే ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. దానికి తోడుగా ఆ రెండు కులాల వారికేనా మాకు ఛాన్స్... - [విశాఖ డెయిరీలో టీడీపీ లక్ష్యం నెరవేరిందా?](https://teluguheadlines.com/visakha-dairy-chairman-adari-anand-his-team-resigned-ysrcp/): విశాఖ డెయిరీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో పాలక టీడీపీకి సానుకూల సంకేతం దక్కింది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న ఆ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఇతర డైరెక్టర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. దాంతో వారిని టీడీపీలో చేర్చుకోవడమా లేక బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్న అడారి ఆనంద్ కి సహకరించడమా అన్నదే మిగిలింది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున బరిలో దిగిన అడారి ఆనంద్ ఓటమి పాలయ్యారు. ఆతర్వాత వైఎస్సార్సీపీలో చేరి మొన్నటి ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. వాస్తవానికి ఆయనకు సానుకూల సంకేతాలు కనిపించినప్పటికీ చివరకు రాష్ట్రవ్యాప్త కూటమి ప్రభావంలో ఆయన కొట్టుకుపోయారు. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న ఆయన లక్ష్యానికి దూరమయ్యారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విశాఖ డెయిరీ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓవైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు పట్టుదలగా వ్యవహరించారు.... - [జోరు వాన, జారుతున్న బురదలోనూ పవన్ ముందుకే!](https://teluguheadlines.com/ap-dcm-in-salur-agency/): మన్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పనసభద్ర పంచాయతీ బాగుజోల వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న 19 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగబోతోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా రోడ్డు సదుపాయం కూడా లేని గ్రామాలకు రహదారి నిర్మాణం ఆహ్వానించాలి. దానికి డీసీఎం పవన్ కళ్యాణ్‌ చొరవను అభినందించాలి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఆర్జీయే పథకంలో భాగంగా నిధులతో ఈ రోడ్ల నిర్మాణం జరపబోతున్నట్టు పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు. వాతావరణం సహకరించకపోయినా, వాన తాకిడితో తాను పర్యటించాల్సిన ప్రాంతం బురదమయంగా మారినప్పటికీ... - [R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ ఇక సెలవు చెప్పేశాడు!](https://teluguheadlines.com/team-india-spinner-r-ashwin-retired/): టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు. ఊహించినట్టుగా ఈసిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తే అందుకు భిన్నంగా మూడో టెస్ట్ ముగియగానే తన నిర్ణయాన్ని అశ్విన్ ప్రకటించాడు. బ్రిస్టేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్ ప్రకటించడంతో టీమిండియాలో ఓ శకం ముగిసినట్టుగా భావించాలి. గతంలో ధోనీ కూడా ఇదే రీతిలో సిరీస్ మధ్యలో తన రిటైర్మెంట్ ప్రకటించిన అనుభవం ఉంది. ఆసీస్ గడ్డ మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు మ్యాచ్ ల అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అశ్విన్ , రోహిత్ కి తోడుగా మరో ఒకరిద్దరు కూడా అదే బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అశ్విన్ 1986, సెప్టెంబర్ 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఇటీవల ఐపీఎల్ మెగా ఆక్షన్ లో సీఎస్కే జట్టు అతన్ని సొంతం చేసుకుంది.... - [కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!](https://teluguheadlines.com/cadre-un-happy-wih-chandrababu-rule/): అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఇంకా కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కేసులు పెట్టించిన ఆయన టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. తిరిగి మళ్లీ అదే కార్యకర్తల మీద పెత్తనం చేసేందుకు సిద్దమవుతున్నారు.ఇది ఒక్క ఏలూరులోనో, మరో ఊరిలో మాత్రమే అనుకుంటే పొరపాటు. దాదాపుగా అన్ని చోట్లా ఇదే తంతు. వలస పక్షులదే పెత్తనం. అప్పుడు చక్రం తిప్పిన వాళ్లే ఇప్పుడు అంతా తామై... - [ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?](https://teluguheadlines.com/why-ilayaraja-became-supporter-of-sangh-parivar/): తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి. ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. “మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు చేయిస్తారు. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకు, ఈ భౌతిక పదార్థాలు,వస్తువులకు అతీతంగా ఏదో శక్తి ఈ సమస్థాన్ని నడిపిస్తూ ఉందని అనిపించేది. అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. నా కన్వర్షన్ కి ప్రధాన కారణం మత్రం, నా తల్లి మృతి చెందడం అని చెప్పొచ్చు. ” అంటూ యువన్ శంకర్ రాజా వెల్లడించారు. ఇస్లాం లోకి మారాలనుకుంటున్నానని డిసైడ్ చేసుకున్నాకే మా నాన్నగారికి... - [ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు](https://teluguheadlines.com/tg-minister-ponguleti-on-amaravati/): తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్‌, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. అదే సమయంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ విషయంలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంలో కీలక నేతలంతా పొంగులేటి మీద ఘాటుగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా ఏపీ విషయంలో బీఆర్ఎస్ మంత్రులు తక్కువ చేసి మాట్లాడడం అనే ఆనవాయితీ ఉండేది. రోడ్లు సహా వివిధ... - [ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు](https://teluguheadlines.com/ilayaraja-not-allowed-to-enter-in-main-temple/): దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా ఎస్సీ కాబట్టి ఆయన గుడిలో ప్రవేశించే అధికారంలో లేదని అడ్డుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భగుడి ముంగిట ఆయన్ను నిలిపివేసి బయటకు పంపించారు. తొలుత ఆలయానికి వచ్చిన ఇళయరాజాకు అధికారులు స్వాగతం పలుకగా… పెరియ పెరుమాళ్ గుడి, నందనవనం, ఆండాళ్ళను ఆయన సందర్శించుకున్నారు. ఈక్రమంలో గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ప్రవేశించేందుకు యత్నించగా అడ్డుకున్న వీడియో వైరలవుతోంది. ఇళయరాజా తన ప్రతిభతో ప్రపంచాన్ని... - [అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!](https://teluguheadlines.com/pawan-kalyan-fulfilling-election-assurances/): ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు ఆమోదం తెలిపారు. దాంతోపాటుగా పిఠాపురంలో ఉన్న ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అనుగుణంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రెండూ పిఠాపురం అభివృద్ధికి దోహదపడే అంశాలు. ప్రజల దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం కూడా ఉంది. పిఠాపురం ఆస్పత్రి అప్ గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్యుల నియామకం, వారికి... - [విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?](https://teluguheadlines.com/virat-poor-form-continues-in-australia/): టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నారు. అడపాదడపా కొత్త ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కొంతమేర ప్రభావం చూపే ప్రయత్నంలో ఉన్నాడు. ముఖ్యంగా సీనియర్ల పరిస్థితి అత్యంత దయనీయం. అందులోనూ జట్టుని ముందుండి నడిపించాల్సిన రోహిత్, విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోంది. విరాట్ అయతే గడిచిన ఐదేళ్ల టెస్ట్ కెరీర్ చూస్తే అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. తన తోటి పోటీ పడిన జో... - [కెప్టెన్సీ నుంచి ఊస్టింగ్ పక్కా! రోహిత్ కెరీర్ ముగింపు?](https://teluguheadlines.com/rohit-sharm-career-will-end/): టీ20 వరల్డ్ కప్ లో జట్టుని ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. తన ఆటతీరుతో పాటుగా జట్టుని నడిపించే విషయంలోనై ఘోరంగా విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇక రోహిత్ శర్మ తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయినట్టుగా అంతా భావిస్తున్నారు. ఆయన తప్పుకోకపోతే తొలగించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లనుంచి వైదొలుగుతూ ప్రకటన చేశారు. కానీ టెస్ట్, వన్డే మ్యాచ్ లలో కొనసాగుతున్నట్టు వెల్లడించిన రోహిత్ కు తదనుగుణంగా కెప్టెన్సీ కొనసాగుతోంది. కానీ స్వదేశంలో న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ కావడం, ఆస్ట్రేలియాతో వరుసగా రెండు, మూడు టెస్టులలో రోహిత్ వైఫల్యం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో పెర్త్ టెస్ట్ మ్యాచ్ ను కైవసం చేసుకున్న టీమిండియా సిరీస్ లో శుభారంభం... - [జగన్ పుంజుకుంటున్నాడంటున్న ఏబీఎన్ ఆర్కే, ఎందుకలా?](https://teluguheadlines.com/abn-rk-warns-chandrababu/): ఏబీఎన్ రాధాకృష్ణ ఆందోళన చెందుతున్నాడా.. చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్నారా.. బాబు విధానాల కారణంగా మళ్లీ వైఎస్ జగన్ కి ఆదరణ పెరుగుతోందని కలత చెందుతున్నారా. తాజాగా ఆయన రాతలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ జగన్ పుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నట్టు చాటుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బలపడుతున్న అంశాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబుని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. సీఎంగా అద్భుత పనితీరు అంటే విజన్ తో పాలించడం మాత్రమే కాదని, ప్రత్యర్థిని కట్టడి చేసే రాజకీయ వ్యూహాలు కూడా ఉండాలని కూడా హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరచడంలో వెనుకబడితే అది చారిత్రక తప్పిదం అవుతుందంటూ ఆందోళన వ్యక్తపరిచారు. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ బలపడి, అధికారం చేపట్టే పరిస్థితి వస్తే అది చంద్రబాబు తప్పిదమే అవుతుందంటూ ఏబీఎన్ ఆర్కే రాసిన రాతల సారాంశం చూస్తుంటే ఏపీలో విపక్షం పుంజుకున్న... - [జమిలీ ఖాయమే కానీ, ఇప్పుడే కాదంటున్న చంద్రబాబు!](https://teluguheadlines.com/chandrababu-hopes-jamili-elections-in-2029/): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. 2027లోనే ఎన్నికలు ఖాయమంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందన్నారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, ఆపార్టీ తీరు చూసి జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందున్నారు. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి... - [హుందాగా అల్లు అర్జున్, విడుదల తర్వాత పెదవి విప్పిన ఐకాన్ స్టార్](https://teluguheadlines.com/allu-arjun-on-victim-family/): పుష్ప2 ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన అల్లు అర్జున్ అనుకోని కష్టాల్లో ఏకంగా జైలు పాలుకావడం సంచలనంగా మారింది. చివరకు ఒకరోజు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. తొలుత భార్య బిడ్డల దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హుందాగా వ్యవహరించడం ఆకట్టుకుంది. “చట్టాన్ని గౌరవిస్తాను. లీగల్ అంశాలపై ఇప్పుడేమి మాట్లాడను. బాధిత కుటుంబానికి అండగా ఉంటాను.” అంటూ ఈ స్టార్ హీరో చేసిన ప్రకటన ఆసక్తిదాయకం. వాస్తవానికి ఆయన్ని హుటాహుటీన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్ , హైకోర్టు బెయిల్ ఇచ్చినా రాత్రి విడుదల చేయకపోవడం వంటి అంశాల్లో కాసింత అసహనంగా కనిపిస్తారని అంతా ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా అల్లు అర్జున్ వ్యవహారం కనిపించింది.... - [Allu Arjun Arrest: కేసుని వైఎస్సార్సీపీ వాదిస్తోందా?](https://teluguheadlines.com/ysrcp-mp-nirnajan-reddy-in-allu-arjun-case/): అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడ్వకేట్ గా ఉండడం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఆపార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. తొక్కిసలాట పేరుతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో చంద్రబాబుని ఎన్నిమార్లు అరెస్ట్ చేయాలంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ఎంపీ నిరంజన్ రెడ్డి ఈ అరెస్ట్ కేసుని డీల్ చేయడం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీ నేత స్వయంగా రంగంలో దిగి అల్లు అర్జున్ కి అండగా నిలుస్తున్నారంటూ కొందరు వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి అల్లు అర్జున్ తో నిరంజన్ రెడ్డి బంధం ఈనాటిది కాదు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో నిరంజన్ రెడ్డికి చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ వ్యవహారాలకు న్యాయ సలహాదారుడికి నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఆ క్రమంలోనే గతంలో చంద్రశేఖర్ రెడ్డి మీద పలు ఫిర్యాదులు కేసుల వరకూ వెళ్లిన సమయంలో... - [దొమ్మరాజు గుకేశ్ విజయానికి మూలం కోహ్లీ ఫిట్ నెస్ మంత్రం అదే!](https://teluguheadlines.com/world-chess-champion-psychology-coach-role/): 2011లో టీమిండియా చివరి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆనాడు టీమిండియా విజయంలో తెరవెనుక కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియా హాకీ మెడల్ సాధించింది. అప్పుడు కూడా టీమ్ సక్సెస్ లో ఆయన పాత్ర ఉంది. తాజాగా గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చిన్నవయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆ చిన్నోడి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆటలు వేరు..ఆటగాళ్ళు వేరు. కానీ ఆయన విజేతలను తయారుచేయడంలో సిద్ధహస్తుడిగా పేరు గడించాడు. అందుకే పాడీ ఉప్టన్ పాపులారిటీ అలా పెరుగుతోంది. టాలెంటెడ్ కోచ్ గా , మోటివేషనల్ స్పీకర్ గా ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంపొందించడంలో ఆయనది పెద్ద పాత్ర. వారిని విజేతలుగా నిలపడంలో కీలక భూమిక. వాస్తవానికి దక్షిణాఫ్రికాలో పుట్టిన పాడ్రిక్ ఆర్దర్ ఉప్టన్ తొలుత బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఇండియాలో అడుగుపెట్టారు. టీమిండియా వెంబడి క్రికెట్ మెంటర్ గా వ్యవహరించారు.... - [భగవద్గీత అమ్మకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే](https://teluguheadlines.com/galla-madhavi-stop-iskon-representatives/): గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలను అమ్ముతుండగా ఆమె అడ్డుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ పేరుతో కొందరు భగవద్గీత అమ్మకాల పేరుతో వీధి వీధి తిరుగుతుండగా గుంటూరులో వారు ఎమ్మెల్యే కంటబట్టారు. వారిని నిలదీసిన గల్లా మాధవి వారిని నిలదీశారు. భగవద్గీత పుస్తకాలు అమ్మే అధికారం మీకు ఎక్కడిదీ అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె తీరు మీద ఇస్కాన్ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది. గుంటూరు వెస్ట్ నుంచి ఆమె తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి విడదల రజనీ మీద ఆమె గెలిచారు. ఆమె భర్త ఇప్పటికే పలు వివాదాల్లో తలదూర్చారు. రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆమె భర్త భూ వివాదంలో నేరుగా ఏపీ సీఎం నుంచి చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే భగవద్గీత విషయంలో ఇస్కాను ప్రతినిధులను నిలదీసిన తీరు వివాదాస్పదమవుతోంది.... - [మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్](https://teluguheadlines.com/keerthy-suresh-friend-became-husband/): స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని మాత్రం ఇంతకాలంగా గుట్టుగా ఉంచింది. తనే స్వయంగా తమ ప్రేమ, పెళ్లి వివరాలను మీడియాకు వెల్లడించింది. గోవా కేంద్రంలో తొలుత హిందూ, ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లాడబోతున్నట్టు తెలిపింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. #ForTheLoveOfNyke అంటూ ట్యాగ్ చేర్చింది. - [మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్! మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు!](https://teluguheadlines.com/murder-attempt-case-on-mohanbabu/): సినీ నటుడు మోహన్ బాబు వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన మీద హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హత్యాయత్నంగా మార్చారు. ఆయన నివాసం వద్ద మంగళవారం సాయంత్రం టీవీ9 ప్రతినిధి రంజిత్ మీద మైక్ తో దాడి కేసులో పోలీసులు స్పందించారు. మీడియా ప్రతినిధుల ఆందోళనతో కేసును సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మోహన్ బాబు మీద నమోదు చేసిన కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 109ను జత చేశారు. తొలుత ఈ కేసుని సెక్షన్ 118 కింద నమోదు చేశారు. వివిధ వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో చివరకు కేసును పహాడి షరీఫ్ పోలీసులు కట్టుదిట్టంగా మారుస్తున్నట్టు కనిపిస్తోంది. నాన్ బెయిలబుల్ సెక్షన్లను జోడించారు. మరోవైపు మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌కు యశోద ఆస్పత్రిలో సర్జరీ పూర్తయ్యింది. జైగోమాటిక్ బోన్‌ను వైద్యుల బృందం సరిచేసినట్టు టీవీ9 వర్గాలు చెబుతున్నాయి. కంటికి, చెవికి మధ్య... - [వైఎస్సార్సీపీని వీడిన మరో మాజీ మంత్రి!ఆయన కూడా అటే!!](https://teluguheadlines.com/ex-minister-avanthi-srinivas-resigned/): 2014లో టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి భీమిలి నుంచి గెలిచారు. 2009లోనూ పీఆర్పీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 నుంచి 2022 వరకూ జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గంట- అరగంట అంటూ ఆయన మీద తీవ్ర దుమారం రేగింది. 2024లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జనసేనలో చేరాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి వరకూ జనసేన అధినేత నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఆయన అంగీకరించగానే పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా వైఎస్సార్సీపీని వీడినట్టు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను వంటి నేతలు జనసేన కండవాలు కప్పుకున్నారు.... - [ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?](https://teluguheadlines.com/chandrababu-proposed-whatsapp-governance/): చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్ టెక్ లాంటి పదాలను వాడుతున్నాంటే..ఆయనంతే మాటల్లో అప్ డేట్ అయిపోతూ ఉంటారు. ఆ క్రమంలోనే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. మెటా సంస్థతో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. 2024 అక్టోబర్ 2నే ఈ ఎంవోయూ అయ్యింది. పౌరుల సేవలన్నీ వాట్సాప్ లో అందించబోతున్నట్టు కలెక్టర్ల భేటీలో కూడా చెబుతున్నారు. ఇక రైతులకు అందించే వ్యవసాయ సమాచారం నుంచి టూరిజం వరకూ సర్వత్రా... - [మోహన్ బాబు- మనోజ్ బాబు- మీడియా తప్పు ఎవరిది? శిక్ష ఎవరికీ?](https://teluguheadlines.com/manchu-family-assets-dispute/): మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొత్తది కాదు. కొంతకాలంగా దాని ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చివరికిలా బయటపడింది. అయితే ఈసారి కూడా భౌతికదాడులు, బౌన్సర్ల తో గొడవలు, గేట్లు నెట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు వంటివి చూస్తున్నాం. సహజంగానే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల చుట్టూ ఏం జరిగినా జనాల్లో ఆసక్తి ఉంటుంది. మీడియాకు మంచి సరుకుగా మారుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనూహ్యంగా మీడియానే నిందిస్తూ, మితిమీరి మీడియా మీద దాడికి దిగుతూ మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హద్దులు మీరి ప్రవర్తించినందుకు ఈపాటికే ఆయన పోలీసుల అదుపులో ఉండాలి. కానీ ఇక్కడ కూడా గాయపడిన బాధితుడు సామాన్య విలేకరి. గాయం చేసిన వాడు ఓ సెలబ్రిటీ. కనుకనే పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా ఇప్పటి వరకూ చర్యలు లేవు. చట్టం అందరికీ సమానం కాదని మరోసారి... - [మూడు ఎంపీ సీట్లు ఏకగ్రీవం, 6 నెలల తర్వాత మళ్లీ రాజ్యసభకు టీడీపీ ఎంపీ!](https://teluguheadlines.com/tdp-will-get-seat-in-upper-house-of-the-parliament/): ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. ఇద్దరు టీడీపీ తరుపున, ఒకరు బీజేపీ తరుపున బరిలో నిలవడంతో వారి ఎన్నికకు మార్గం సుగమమయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు,సానా సతీష్ బాబు,బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు.మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు.మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన,ఉప సంహరణల గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈనామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్,కొల్లు రవీంధ్ర,అనగాని సత్యప్రసాద్,సత్యకుమార్ యాదవ్, కె.అచ్చన్నాయుడు,పి.నారాయణ,పలువురు ఎంఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. గత... - [బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన](https://teluguheadlines.com/balineni-srinivasa-reddy-hopes-gone/): వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నాటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా మరోసారి ఆశాభంగమయ్యింది. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది. కనీసం బాలినేని అనుచరులను కూడా వెంట తీసుకురాకుండా ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్థుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ నిర్వహించేందుకు అధినేత అంగీకరించారని చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు నెలలు గడుస్తున్నా అలాంటి అనుమతి రాలేదు. అవకాశం లేదు. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కంకణం కట్టుకున్నానని చెబుతున్నా బాలినేని మాటను పవన్ కళ్యాణ్‌ ఖాతరు చేయడం లేదు. ఇక బాలినేని ఆశించినట్టు శాసనమండలిలో అడుగుపెట్టాలన్న కలలు కూడా కరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కొణిదెల నాగబాబును మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దాంతో బాలినేని... - [ఈ క్రికెటర్ త్వరలో డాక్టర్ అయిపోతున్నాడట..!](https://teluguheadlines.com/venkatesh-aiyer-pursuing-his-phd/): జాన్ కోరా,సీనియర్ జర్నలిస్ట్ క్రీడాకారులు ఏం చదువుకున్నారు? సచిన్ టెన్త్, కోహ్లీ ఇంటర్, ధోనీ బీఏ ఫెయిల్ అంటూ చాలా సార్లు మనం సోషల్ మీడియాలో పోస్టులు చూశాం. క్రికెటర్లు, సినిమా నటులు, కళాకారులు చాలా మంది పెద్దగా చదువుకోలేదని.. అయినా వారు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడం లేదా అని ప్రశ్నించే వారినీ చూశాం. కానీ.. అది అన్ని వేళలా సాధ్యం‌ కాదు. ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా పిల్లల మనసుల్లో చదువుకు విలువే లేదనేది నాటుతున్నామని గ్రహించలేక పోతున్నాం. ఇంజనీరింగ్ చేసిన అనిల్ కుంబ్లే ఒక సారి ఏమన్నాడంటే.. నేను బంతిని పెద్దగా స్పిన్ చేయనని.. నేనసలు స్పిన్నర్నే కాదన్నారు. ఆ విషయం పాక్షికంగా నిజమే ఒప్పుకుంటా. నేను బంతిని పరిస్థితికి తగ్గట్టు స్పిన్ చేస్తా.. అన్ని బంతులను కాదు. నేను ఇంజనీరింగ్ చదివా.. ఒక బంతిని ఎంత వేగంతో.. ఏ దిశలో వేస్తే.. బంతి వికెట్లను తాకుతుందో నేను... - [ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్‌ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు](https://teluguheadlines.com/pdf-borra-gopi-murthy-won/): ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా విజయం సాధించారు. ఏకపక్షంగా తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం దక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి గంథం నారాయణరావుని చిత్తుగా ఓడించారు. అభ్యర్థుల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏకంగా 65 శాతం పైబడి ఓట్లను సాధించడం విశేషం. 50 శాతం ఓట్లతోనే ఎమ్మెల్సీ గెలపు ఖాయం కాగా, పీడీఎఫ్ అభ్యర్థికి పెద్ద స్థాయిలో ఆదరణ కనిపించింది. శాసనమండలిలో ప్రస్తుతం పీడీఎఫ్ కి ముగ్గురు... - [వాళ్ల తర్వాత నితీశ్ రెడ్డేనా! కపిల్, అమర్నాథ్ వంటి వారి బాటలో సాగుతాడా?](https://teluguheadlines.com/nitish-reddy-performance-in-australia/): నిజానికి దేశంలోనే మిగతా క్రికెట్ అసోషియేషన్ల కంటే చిన్నదైనా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నుండి టీమ్ ఇండియా జట్టులో ఈ మధ్య కాలంలో కాస్త ప్రాతినిధ్యం పెరగడం కాస్త గుడ్ న్యూస్! దానిలో భాగంగానే ఇక్కడ నుండి మొదట MSK ప్రసాద్.. KS భరత్.. హనుమ విహారి ల తర్వాత ఇప్పుడు నాలుగో వాడిగా నితీష్ కుమార్ రెడ్డి (NKR) ఇండియా టెస్ట్ క్యాప్ ధరించడంతో పాటు సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్టు ఈ యంగ్ క్రికెటర్ ఆడుతుండడం మంచి విషయం! ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నితీష్ కెరీర్ తొలి రోజుల్లో వెన్నుండి అతన్ని మంచి అల్ రౌండర్ గా తీర్చిదిద్దిన కడప ఆంధ్రా క్రికెట్ అకాడమీ(ACA) వారిని ఇక్కడ ప్రత్యేకంగా అభినందించాలి! ఈ అకాడమీ ద్వారా ఇప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి వారికి పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తుంది! వాస్తవానికి... - [లక్కీ భాస్కర్‌ - మట్కా - పుష్ప : మూడు సినిమాలు ఒకటే సారాంశం!](https://teluguheadlines.com/pushpa-and-lucky-bhaskar-subjects-are-same/): దాదాపు నెల రెండు నెలల వ్యవధిలో రిలీజైన్‌ లక్కీ భాస్కర్‌, మట్కా, పుష్ప-2 సినిమాలను చూస్తే ఒకటే కథాంశం కనిపిస్తుంది. అక్రమ మార్గాల్లో కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేదే ఈ మూడు సినిమాల సారాంశం. కథ జరిగే కాలాలే వేరు తప్ప…కథానాయకుల తీరు ఒక్కటే. లక్కీభాస్కర్‌ సినిమాలో హీరో బ్యాంకుల మోసం చేసి, ఆ డబ్బును షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి, ఆ మార్కెట్‌లోనూ తన కుతంత్రాన్ని ప్రయోగించి కోట్లు కొల్లగొడతాడు. మట్కా సినిమా కథానాయకుడు…మట్కా అనే సింగిల్‌ నెంబర్‌ లాటరీ అనే వ్యవసాన్ని జనానికి అలాటుచేసి, జనంలోని దురాశను ఆసరా చేసుకుని, కోట్ల రూపాయలు కుప్పపోస్తాడు. మూడో సినిమా…పుష్ప. ఈ చిత్ర నాయకుడు ఎర్రచందాన్ని అక్రమంగా నరికి, విదేశాలకు ఎగుమతి చేసి వందల వేల కోట్లు వెనుకేసుకుంటాడు. మామూలుగానైతే ఇవి విలన్లు చేసే పనులు. లేదా అటువంటి పనులు చేస్తే వారిని విలన్లుగా చూస్తాం. కానీ మారిన కాలంలో…విలన్లు చేసే... - [మంచు ఇంట్లో చిచ్చు, మోహన్ బాబు మీద మనోజ్ ఫ్యామిలీ ఫిర్యాదు!](https://teluguheadlines.com/manchu-manoj-complaint-on-mohanbabu/): ఆస్తుల కోసం, పెత్తనం కోసం సాగే వివాదాలు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టడం చాలా సహజం. అందులో చిన్నా, పెద్దా, సెలబ్రిటీ అన్న తేడా ఏమీ ఉండదని తాజాగా మంచు ఫ్యామిలీ నిరూపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో తగాదా తారస్థాయికి చేరింది. తాజాగా తమకు అన్యాయం జరుగుతోందంటూ మోహన్ మీద మంచు మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. చిత్తూరు జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం నడుస్తోంది. మోహన్ బాబు మాత్రం విష్ణుకి అనుకూలంగా ఉన్నారు. ఆ వ్యవహారం ఇప్పటికే దుమారం రేపింది. మంచు మనోజ్ సారధ్యంలో యూనివర్సిటీ నిర్వహణలో వైఫల్యాలపై విద్యార్థి సంఘాల ఆందోళనకు మంచు మనోజ్ మద్ధతుగా నిలవడం కలకలం రేపింది. దానికి కొనసాగింపుగా తాజాగా తన తండ్రి మోహన్ బాబు తమపై దాడికి దిగారంటూ మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు... - [బ్యాటర్ల తీరు మారకుంటే సిరీస్ గోవిందా! షమీ ఎప్పుడొస్తాడు?](https://teluguheadlines.com/team-indai-batters-failure/): ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సాధించిన రికార్డ్ విజయం మరచిపోకముందే పింక్ బాల్ టెస్టులో ఓటమి పాలయ్యింది. బుమ్రా నాయకత్వంలో గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైడ్ లో పరాభవం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా బ్యాటింగ్ పేలవ ప్రదర్శనతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో చరిత్రలో వేగంగా ముగిసిన టెస్ట్ గా ఈ మ్యాచ్ మిగిలిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వారు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒక్కరైనా ముందుండి జట్టుని నడిపించాలి. సరిగ్గా పెర్త్ లో అదే జరిగింది. కోహ్లీ సెంచరీ కారణంగా జట్టు గెలిచింది. అడిలైడ్ లో వరుస సెంచరీల స్థాయి కాకపోయినా రెండు ఇన్నింగ్సులలో ఏదో ఓ సమయంలో రాణించాల్సి ఉంది. కనీస రన్స్ సాధించి, పార్టనర్ షిప్ నెలకొల్పాల్సి ఉంది.... - [రాజ్యసభలో డబ్బు కట్టలు](https://teluguheadlines.com/cash-found-in-rajyasabha/): భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు. అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్‌ మను సంఘ్వీ సీటు దగ్గర డబ్బులు దొరికడం విశేషం. విచారణ జరుగుతోందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. అయితే డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. పార్లమెంట్ లో అంత పెద్ద మొత్తం ఎలా వచ్చిందన్నది కూడా తేలాల్సి ఉంది. రూ.500 నోట్లు దాదాపు వంద ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా పార్లమెంట్ లో ఓటుకి నోటీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.... - [ఇల్లు కడుతున్నారా? మంచి సిమెంట్ ఎంపిక చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలతో!](https://teluguheadlines.com/which-best-cement-for-a-building/): ఎంతో మంది ఇళ్లు లేదా భవన నిర్మాణాలు చేపడుతుంటారు.కాని అందులో కొందరికి మాత్రమే ఆయా నిర్మాణాలలో ఏ రకమైన “సిమెంట్” వాడాలో తెలిసి ఉంటుంది. ఆ విషయాలు తెలియని వారు అటువంటి విలువైన సాంకేతిక సమాచారం కోసం చదవ వచ్చు.. “ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు” అంటుంటారు పెద్దలు.చాలామందికి సొంతిల్లు సమకూర్చుకోవడం ఒక కల. దాన్ని సాకారం చేసుకోవడానికి వారు పడే కష్టం వర్ణనాతీతం.అలాంటి ఇల్లు మూడు తరాల పాటు నిక్షేపంగా నిలవాలంటే దాని నిర్మాణంలో అత్యంత కీలకమైన “సిమెంట్”వినియోగంపై అవగాహన అవసరం. ముందుగా ఎన్ని రకాల సిమెంట్ లు ఉన్నాయో చూడండి 1. Ordinary Portland Cement 33 grade (OPC 33) (IS: 269-2015) ఈ సిమెంట్ ప్రస్తుతం మార్కెట్లో దొరకడం లేదు 2. Ordinary Portland Cement 43 grade (OPC 43) (IS: 269-2015) 3. Ordinary Portland Cement 53 grade... - [అక్కడ అన్ని పార్టీలు ఒక్కటే, మరిక్కడ ఇలా కలిసెళ్లి విజయవాడ వరద సహాయం అడగలరా?](https://teluguheadlines.com/all-party-mps-from-kerala-fight-unitedly/): పైన ఫోటోలో కేంద్ర హోం శాఖ మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నేతలంతా ఒక్క పార్టీ కాదు. కానీ ఒక్క రాష్ట్రం వారే. తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల వరకూ తామంతే ఒకటేనని చాటుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నారు. కేరళకి చెందిన ఎంపీలతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. తమ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. ఉమ్మడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎంపీలంతా కలిసి కేంద్ర హోం మంత్రిని కలిశారు. ఒక్క హోం మంత్రినే కాదు.. ఏ శాఖకు సంబంధించిన అంశాల మీద ఆయా మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సమిష్టి యత్నం సాగుతోంది. ఏపీలో ఎంపీలంతా ఒకే తాటి మీదకు వచ్చిన సందర్భం చూడగలమా. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో సమిష్టిగా ప్రయత్నం ఆశించగలమా..... - [సూపర్ స్టార్ కృష్ణకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పోలిక ఏంటి?](https://teluguheadlines.com/ys-jagan-helps-allu-arjun-for-pushpa2-openings/): తెలుగునాట ఎవరికిష్టమున్నా లేకున్నా సినిమాల ప్రభావం అసామాన్యం. సినీ హీరోలను కొలిచే యువతరం ఎప్పుడూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సినిమాల నుంచి వచ్చి రాజకీయాలను, ప్రజల జీవితాలను శాసించే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. వారిలో కొందరు సక్సెస్ అయిన చరిత్ర కూడా తెలుగునేల మీద ఉంది. తెలుగు హీరోలలో నెంబర్ వన్ గేమ్ ఆరంభం నుంచి ఆసక్తికరమే. అందులోనూ ఎన్టీఆర్ హవా సాగిన తర్వాత ఆయన కొత్త ట్రాక్ ఎంచుకోవడంతో ఆయన తర్వాత ఎవరూ అన్న ప్రశ్న ఉదయించింది. అదే సమయంలో సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి మెగాస్టార్ గా రూపొంతంరం చెందుతున్న మధ్య సంధికాలాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఏలిన కాలం కూడా కొంత ఉంది. డేరింగ్, డాషింగ్ హీరోగా కృష్ణకు ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. అదే ఆయనకు అండగా మారింది. ఎన్టీఆర్ రాజకీయాల వైపు మళ్లడం, చిరంజీవి ఇంకా ఎదుగుతున్న దశలో కొంతకాలం పాటు టాలీవుడ్ ను ఏలేందుకు... - ['సీజ్ ద షిప్' చివరికి అలా ఉపయోగపడింది..!](https://teluguheadlines.com/pawan-dialogue-became-cinema-title/): కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఫలితాన్నిచ్చినట్టు కనిపించడం లేదు. పది రోజులు గడుస్తున్నా ఆయన ఆదేశాలు అమలులోకి రాలేదు. ఇంకా ఆ బియ్యం ఎవరివన్నది తేల్చలేదు. చివరకు బుధవారం శాంపిల్స్ సేకరించారు. అవి పీడీఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడానికే పది రోజులు పడుతుంటే ఇక అసలు కథ కొలిక్కివచ్చేదెన్నడూ అన్నది ప్రశ్నార్థకం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మాత్రం సినిమాట్రిక్ గా ఉండడంతో ఏకంగా సినిమా టైటిల్ ఒకటి సిద్ధమయ్యింది. సీజ్‌ ద షిప్‌’ పేరుతో సినిమా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అయింది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఆర్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, ప్రొడక్షన్స్‌ అనే సంస్థ సోమవారం ఈ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకొంది. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నౌకను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పరిశీలించారు. ఆ క్రమంలో ఆయన చేసిన ‘సీజ్‌ ద షిప్‌’ అనే వ్యాఖ్యలు... - [Pushpa2 Review: పుష్ప2 అల్లు అర్జున్ విశ్వరూపమే, రివ్యూ](https://teluguheadlines.com/allu-arjun-pushpa2-the-rule-review/): సినిమా: పుష్ప 2 – ది రూల్‌యాక్టర్స్: అల్లు అర్జున్‌, ర‌ష్మిక, ఫాహాద్ ఫాజిల్‌, జ‌గ‌ప‌తిబాబు, ధ‌నుంజ‌య‌, రావు ర‌మేష్‌, సునీల్‌, అన‌సూయ‌సాంగ్స్: చంద్ర‌బోస్‌యాక్ష‌న్‌: పీట‌ర్ హెయిన్‌, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కిచ్చా, న‌వ‌కాంత్‌సినిమాటోగ్ర‌ఫీ: కూబాఎడిటింగ్‌: న‌వీన్ నూలీమ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌ప్రొడ్యూసర్స్: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలిస్టోరీ, డైరెక్షన్: సుకుమార్ బండ్రెడ్డి నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ద రైజింగ్ తో నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తోన్న పుష్ప 2 సినిమాపై దేశ‌వ్యాప్తంగా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు రు. 1060 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమా రివ్యూ చూద్దాం స్టోరీ:పుష్ప 1కు కొన‌సాగింపు విషయమే. పెద్ద మలుపులేమీ ఉండవు. పుష్ప (బ‌న్నీ) త‌న భార్య శ్రీ వ‌ల్లి ( ర‌ష్మిక ) తో కాపురం చేసుకోవ‌డం.. ఈ క్ర‌మంలోనే జ‌స్ట్ త‌న భార్య కోరిక... - [కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేయలేమని తేల్చేసిన ఏపీ ప్రభుత్వం](https://teluguheadlines.com/ap-govt-decided-to-legal-action-on-ship-with-rice/): ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న పనామా స్టెల్లా షిప్ ను సీజ్ చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు సహా ఇతర అక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంయుక్తంగా ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాదాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియమించాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని భావిస్తున్నట్టు... - [కాకినాడ: అప్పుడు డీప్ వాటర్ పోర్టు, ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ బలి చేస్తున్నారా?](https://teluguheadlines.com/chandrababu-planning-to-close-anchorage-port/): కాకినాడ పోర్ట్ వ్యవహారం పెను దుమారం దిశగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ రాజేసిన వివాదం ఇప్పట్లో సర్థుమణిగేలా లేదు. దానికి కారణం ఏకంగా కాకినాడలో సుదీర్ఘ చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్ట్ మీద ప్రభుత్వం కన్నేసిందన్న ప్రచారమే. ఏకంగా యాంకరేజ్ పోర్ట్ మూతవేసే దిశలో ఉందంటూ వస్తున్న కథనాలే అందుకు కారణంగా కనిపిస్తోంది. కాకినాడ తీరం కొంత భిన్నంగా ఉంటుంది. కాకినాడ పోర్టుకి ఎదురుగా బంగాళాఖాతంలో హోప్ ఐలాండ్ ఏర్పడడం, అది క్రమంగా విస్తరించడంతో కాకినాడలో సహజసిద్ధంగా పోర్ట్ ఏర్పడలేదు. దాంతో ఐలాండ్ కి, కాకినాడ తీరానికి మధ్య నౌకలు లంగరు వేసి నిలుపుతారు. అక్కడికి తీరం నుంచి బార్జీలలో సరుకులు తీసుకెళ్లి సముద్రం మధ్యలో ఓడల్లోకి తరలిస్తారు. ఓడల ద్వారా వచ్చిన సరుకులను అదే రీతిలో దిగుమతి చేసి బార్జీల ద్వారా ఒడ్డుకి తీసుకొస్తారు. దానినే యాంకరేజ్ పోర్ట్ ఉంటారు. ఈ యాంకరేజ్... - [రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!](https://teluguheadlines.com/civil-supplies-minister-nadendla-manohar-on-rice-mafia/): ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ నుంచి ఎగుమతి చేశారంటూ వివరించారు. కాకినాడ పోర్ట్ కేంద్రంగా సాగుతున్న రేషన్ మాఫియా కుట్రపూరితంగా సాగిందని విమర్శించారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం మీద తమకు కక్ష లేదని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ప్రయత్నమన్నారు. అరబిందో రియాల్టీకి కాకినాడ సీపోర్ట్స్ లో 41 శాతం వాటా ఎలా అప్పగించారని ఆయన ప్రశ్నించారు. భారత కార్పోరేట్ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కేవీ... - [ఏబీఎన్, టీవీ5 తగాదాకి మూలమైన తలనూనె మళ్లీ వచ్చింది!](https://teluguheadlines.com/nuzen-hair-oil-dispute-between-abn-and-tv5/): నూజెన్ హెయిర్ ఆయిల్ గుర్తుందా, చాన్నాళ్లకు మళ్లీ వచ్చింది. కొంతకాలం మరుగున పడిన ఆ తలనూనె మళ్లీ తడాఖా చూపించే దిశలో సాగుతోంది. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇటీవల పదవీయోగం దక్కింది. ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. ఆయనకు అధికార హోదా దక్కిన తర్వాత చాలాకాలానికి మళ్లీ నూజెన్ హెయిర్ ఆయిల్ తెరమీదకు వచ్చింది. ప్రకటనలు కనిపిస్తున్నాయి. పదేళ్లకు పూర్వం నూజెన్ హెయిర్ ఆయిల్ ఓ సంచలనం. బట్టతల మీద జట్టు మొలిపించేస్తామంటూ పెద్ద హంగామా. ఆ ప్రచారంలో లొసుగులను పట్టుకుని ఏబీఎన్ రాధాకృష్ణ చెడుగుడు ఆడేశాడు. దాంతో ఏబీఎన్ కి, టీవీ5కి మధ్య చాన్నాళ్ల పాటు యుద్దమే నడిచింది. ఇరు సంస్థలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకునే వరకూ వెళ్లింది. ఈ ఆయిల్ వాడకం వల్ల నష్టాలే తప్ప లాభం లేదని, ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆంధ్రజ్యోతి పదే పదే కథనాలు ఇచ్చింది.... - [రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!](https://teluguheadlines.com/pawan-wants-to-control-ration-mafia/): సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు. ఇంకేముందు అందరినీ కట్టడి చేస్తున్నామన్నారు. పీడీ యాక్ట్ కూడా పెడుతున్నామన్నారు. ఒక్క గింజ కూడా బయటకి పోదన్నారు. ఆరు నెలలు గడిచే సరికి కథ ఏమీ మారలేదని అదే జనసేన అధినేత అంటున్నారు. రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోలేకపోతున్నారని ఆగ్రహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కన్నెర్ర చేయడంతో హుటాహుటీన కాకినాడ సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ను మార్చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి... - [రేషన్ బియ్యం మాఫియాపై రంగంలోకి పవన్ కళ్యాణ్‌, అధికారులపై సీరియస్](https://teluguheadlines.com/pawan-kalyan-on-kakinada-port-rice-exports/): కాకినాడ నుంచి పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారం దుమరం రేపుతోంది. రేషన్ బియ్యం మాఫియా యధేశ్ఛగా బియ్యం తరలింపు సాగిస్తున్న తరుణంలో నేరుగా డిప్యూటీ సీఎం రంగంలో దిగడం ఆసక్తిగా మారింది. కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ వెంట ఉన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా వివరాలను డీసీఎంకి మంత్రి వివరించారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం వివరాలను పవన్ తెలుసుకున్నారు. స్వయంగా సముద్రంలోకి... - [కంగనా కథ నమ్మేసి అభాసుపాలయిన ఆంధ్రజ్యోతి!](https://teluguheadlines.com/andhrajyothi-mistake-in-pm-security/): ఆంధ్రజ్యోతి తప్పులో కాలేసింది. నిర్ధారణ లేని వార్త రాసి చేతులు కాల్చుకుంది. మరి తప్పిదాన్ని సరిదిద్దుకునేలా రేపు పాఠకులకు అసలు వాస్తవం చెబుతుందో లేదో చూద్దాం. అందరికీ నీతులు చెప్పే బల్లి కుడితిలో పడిందన్న నానుడి చందంగా వేమూరి రాధాకృష్ణ పత్రిక తీరు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెక్యూరిటీలో మహిళా అధికారి ఉన్నట్టుగా ఫోటోతో వార్త ఇచ్చింది. కానీ అది అది వాస్తవం కాదు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాడీగార్డ్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 27నాడు పార్లమెంట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీసిన ఫోటోలో రాష్ట్రపతి రక్షణ బృందంలోని మహిళా అధికారిని ప్రధానికి ఆపాదించి జ్యోతి చిత్రమైన వార్తను ఇచ్చింది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పార్లమెంట్‌కు వచ్చిన సమయంలో ఆమె ముందు నడుస్తుండగా, ఆవిడ వెనుకే ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్ నడిచారు. వారి వెనుక ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఫోటో తీసి ప్రధాని... - [సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ](https://teluguheadlines.com/bihar-mp-return-gift-to-cm-ramesh/): అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు ఖరీదైన కానుకలు పంపిణీ చేశారు. వాటిపై బీహార్ కి చెందిన ఎంపీ సుదామ ప్రసాద్ ఎదురుతిరిగారు. సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ లో ఒక గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉండడాన్ని సుదామ ప్రసాద్ తప్పుబట్టారు. ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడమేనంటూ హితువుపలికారు. ప్రజాధనాన్ని ఇలా పార్లమెంట్ సభ్యలకు గిఫ్టుల పేరుతో వృధా చేయడం తగదంటూ సూచించారు. అంతేగాకుండా తనకు ఇచ్చిన... - [ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?](https://teluguheadlines.com/actor-subba-raju-marriage/): సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే. చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తర్వాత అనేక మంది సుబ్బరాజుని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 47 ఏళ్ల వయసున్న సుబ్బరాజుకి పెళ్లేంటి అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుబ్బరాజు సినిమాల్లో విభిన్న క్యారెక్టర్లు పోషించారు. కామెడీ, విలనీ వంటి పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితుడిగా ఉన్నారు. అలాంటి సుబ్బరాజు మీద ట్రోలింగ్ విస్మయకరం. వాస్తవానికి పెళ్లి ఎవరిదైనా అది... - [నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!](https://teluguheadlines.com/akhil-akkineni-fiancee-background/): అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో జుల్పీ రావుద్జీ కొన్ని కంపెనీలు నడిపారు. వాన్ పిక్ లో కూడా భాగస్వామి. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. చాలాకాలంగా నాగార్జునకి సన్నిహితుడు. జుల్ఫీ రావుద్జీ‌ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రావుద్జీ‌... - [జనసేనకి రాజ్యసభ సీటు, నాగబాబు కోరిక తీరేనా?](https://teluguheadlines.com/janasena-eye-on-rajyasabha-seat/) - [జమ్మలమడుగు ఆదినారాయణ సంగతి చూస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి](https://teluguheadlines.com/rtpp-fly-ash-issue-between-jc-prabhakar-reddy-and-adinarayana-reddy/): జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే అదానీ సంస్థల కాంట్రాక్ట్ తీసుకున్న సీఎం రమేశ్ తో తగాదా ఏకంగా ఆస్తుల ధ్వంసం వరకూ వెళ్లింది. తాజాగా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకునే వరకూ సాగుతోంది. దీని మీద జేసీ ఘాటుగా స్పందించారు. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్‌ తరలిస్తున్న జేసీకి చెందిన వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ పరిధిలోని ప్లాంట్ మీద జేసీ పెత్తనమేమంటూ వారు నిలదీశారు. దీని మీద జేసీ నేరుగా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తమ వాహనాలు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు. కడపలో ఫ్లైయాష్ తరలించుకుండా మా వాహనాలు అడ్డుకుంటే, మేము కడపకు సిమెంట్, ఇనుము తరలించకుండా వాహనాలు అడ్డుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీకి నేరగా లేఖ రాశారు. మా... - [ఈవీఎంల భాగోతం బయటపడుతున్నా, విపక్షాలు ఎందుకలా ఉంటున్నాయి?](https://teluguheadlines.com/doubtful-evms-in-indian-elections/): పోలయిన ఓట్ల కన్నా ఎక్కువే లెక్కిస్తున్నారుఈవీఎం ఛార్జింగ్ ఎక్కడా తగ్గడం లేదువీవీ పాట్ల లెక్క తేల్చడం లేదుఈవీఎంలు ఓటేసిన వాళ్లే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు దేశంలో ఎన్నికల వ్యవస్థ చుట్టూ సందేహాలు చెలరేగుతున్నాయి. ఈ అనుమానాలు రానురాను బలపడుతున్నాయి. ఇప్పటికప్పుడు అపోహలు తొలగించాల్సిన ఎన్నికల కమిషన్ వాటికి మరింత ఊతమిస్తోంది. ప్రజల్లోంచి వస్తున్న సందేహాలు తీర్చడానికి ససేమీరా అంటోంది. భవిష్యత్తులో ఇది పెను దుమారం దిశగా సాగుతోంది. మహారాష్ట్రలో తాము ఓటేసిన పార్టీకి సున్నా ఓట్లు వచ్చి ప్రత్యర్థికి ఎలా ఓట్ల దక్కాయంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముట్టడించారు. ఏపీలో కూడా తక్కువేం కాదు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 28వ పోలింగ్ బూత్ లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లతో పోలిస్తే అదే పోలింగ్ బూత్ లో ఎంపీ అభ్యర్థికి 435 ఓట్లు అధికంగా రావడం విస్మయకరంగా లేదా. ఇలాంటి ఒక్కటి కాదు..వందల ఉదాహరణలు. హర్యానాలో పోస్టల్... - [అనుష్క శర్మ ఉంటేనే కోహ్లీ సెంచరీలా?](https://teluguheadlines.com/virat-kohli-wife-inspired-him/): విరూష్క అంటూ పిలుచుకునే ఈ జంట గురించి అనేక ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ కి తెలుసు. తాజాగా టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మరో విషయం వెలుగులోకి తెచ్చాడు. అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉంటే విరాట్ రెచ్చిపోతుంటాడంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు గతంలో జరిగిన పరిణామాలను ఉదహరించాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో విరాట్ సెంచరీ చేసిన సమయంలో అనుష్క శర్మ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. 2015 లో రావిశాస్త్రి మన ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ ఉన్న కాలం నాటి నిబంధన ప్రకారం కేవలం ఆటగాళ్ల భార్యలను మాత్రమే లాంజ్ లోకి అనుమతించేవారు. దాంతో విరాట్ కోహ్లీ కి అది గిట్టలేదు. అప్పటికింకా తమకు పెళ్లికాకపోయినా అనుష్కతో కోహ్లీ డేటింగ్ లో ఉన్నాడు. ఆసమయంలో బోర్డు నిబంధన తనకు ఇబ్బందిగా ఉందంటూ నేరుగా కోచ్ ముందు ప్రస్తావించాడు. అయినా రవిశాస్త్రి అంగీకరించలేదు. చివరకు బీసీసీఐ... - [ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా](https://teluguheadlines.com/team-india-won-with-huge-margin-in-perth/): బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. తాత్కాలిక కెప్టెన్ జస్ఫ్రిత్ బుమ్రా అధ్భుతంగా రాణించి జట్టుని విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా సెనా దేశాల గడ్డ మీదనే అత్యధిక తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో ఏకంగా 295 రన్స్ ఆధిక్యంతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత సీజన్ లో జరిగిన పెర్త్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. న్యూజీలాండ్‌తో సొంత గడ్డపై 0-3 తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. ఆసీస్ గడ్డపై జరుగుతున్న బీజీటీ సిరీస్‌పై ఇండియాపై పూర్తిగా నమ్మకం పోయింది. ఆస్ట్రేలియాలోని పేస్ ట్రాక్స్‌పై ఇండియా తేలిపోతుందని భావించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ చూశాక.. రెండు రోజుల్లోనే మ్యాచ్ చుట్టేస్తారని అనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో యువ క్రికెటర్ జైస్వాల్ పోరాటం, క్లాసీ కోహ్లీ సెంచరీ కలిసి.. ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల విజలక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆస్ట్రేలియా జట్టు కేవలం 238 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో... - [రిషబ్ పంత్ కొత్త రికార్డు, శ్రేయస్ అయ్యర్ తో ఆషామాషా కాదు](https://teluguheadlines.com/pant-to-lsg-in-mega-auction/): ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపుతున్నాడు. ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పొతున్నారు. సెట్ 1లో ఉన్న రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పరమయ్యాడు. చివరి వరకూ దిల్లీ ఆర్ టీ ఎం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ మొత్తానికి ఎల్ఎస్జీ ఆఫర్ చేయడంతో పంత్ లక్నో టీమ్ సొంతమయ్యాడు. అయితే అందరూ ఊహించిన విధంగా పంత్ కోసం సీఎస్కే, ఆర్సీబీ ఆసక్తి చూపకపోవడం విశేషం. కొంత సేపు ఎస్ఆర్ హెచ్ మాత్రం పోటీ పడింది. కానీ చివరకు పూరన్ తో కలిసి ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కీపర్లు ఎల్ఎస్జీ లో చేరినట్టయ్యింది. కేఎల్ రాహుల్ మాత్రం కేవలం 14 కోట్లకే దిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు. సీఎస్కే కూడా కొంతసేపు పోటీ పడినప్పటికీ పంత్ ఎల్ఎస్జీ వైపు వెళ్లడంతో కేఎల్ రాహుల్ ఇటు వచ్చినట్టయ్యింది. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ కోసం గట్టి... - [యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు](https://teluguheadlines.com/yasaswi-jaiswal-century-helped-team-india/): బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ సరసన జైశ్వాల్ పేరు చేరింది. అంతేగాకుండా ఇప్పటికే నాలుగో సెంచరీ సాధించిన యశశ్వి ప్రతీ సెంచరీని 150 మార్క్ చేరుకోవడం మరో రికార్డ్. తొలుత కేఎల్ రాహుల్ తో కలిసి 200 రన్స్ పార్టనర్ షిప్ నమోదు చేసిన జైశ్వాల్ ఆతర్వాత పడిక్కల్ తో 50 రన్స్ పార్టనర్ షిప్ నమోదు చేసి టీమిండియా ఆధిక్యం 300... - [అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?](https://teluguheadlines.com/ap-senior-ias-officer-link-with-adani/): అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును మరో లెవలుకు తీసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రస్తావనకు రాని ఐఏఎస్ అధికారుల పాత్ర గురించి పీవీఆర్ ప్రస్తావించారు. పైగా తాను చేసిన ట్వీటును ఏపీ సీఎంకు ట్యాగ్ చేశారు. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేసిన పీపీఏల విషయంలో .. అలాగే 2021 డిసెంబరులో సోలార్ పవర్ ఒప్పందాల్లో ఇద్దరు IASలు కీలక పాత్ర పోషించారని ప్రస్తావించారు. అంతే కాకుండా..... - [ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్](https://teluguheadlines.com/ap-govt-took-back-decision-on-school-timings/): ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు తెరిచేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ తీరా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం పెట్టాయి. ప్రభుత్వ తీరు మీద ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో స్కూల్ సమయాలు సవరించడం మీద గగ్గోలు పెట్టారు. ఇది ఏమాత్రం ప్రయోజనం కాదంటూ అభిప్రాయపడ్డారు. దాంంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. చివరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో నడిపిన చర్చల్లో నిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ... - [ఆస్ట్రేలియాతో టెస్టులో టీమిండియాను ఆదుకున్న తెలుగోడు](https://teluguheadlines.com/nitish-kumar-reddy-is-top-scorer-for-teamindia/): ఆంధ్రా జట్టు ఆటగాడు ఆరంభ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల మధ్య టీమిండియా స్కోర్ 150 రన్స్ కి చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. తన ఆరంభ మ్యాచ్ లోనే జట్టు తరుపున హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కెరీర్ తొలి ఇన్నింగ్స్ లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 41 రన్స్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి కొంత సేపు ఆస్ట్రేలియన్ బౌలర్లను ప్రతిఘటించారు. చివరకు ఓ దశలో 49 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి ఈ ఇద్దరి బ్యాటింగ్ కారణంగా 150రన్స్ కి చేరింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తీయగా, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు చొప్పున దక్కించుకున్నారు. కీలక బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే అవుటయిన మ్యాచ్ లో నితీశ్ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.... - [కేఎల్ రాహుల్ అవుటా, నాటవుటా, ఎందుకీ వివాదం?](https://teluguheadlines.com/kl-rahul-un-happy-with-decision-in-perth/): ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గడ్డు పరిస్థితిలో పడింది. టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయింది. యంగ్ బ్యాటర్లు యశశ్వి జైశ్వాల్, పడిక్కల్ డకౌట్లుగా వెనుదిరగగా, ఆ తర్వాత కింగ్ కోహ్లీ కూడా స్వల్ప స్కోర్ కే అవుటయ్యాడు. కొంత సేపు రిషబ్ పంత్ తో కలిసి ప్రతిఘటించిన రాహుల్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి 51 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ కి కొద్దిసేపటికి ముందు పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ అవుట్ వివాదాస్పదంగా మారింది. అది నాట్ అవుట్ అనే వాదన బలపడుతోంది. ఇప్పటికే రాహుల్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బ్యాట్ ప్యాడ్స్ ను తాకినప్పుడు వచ్చిన సౌండ్ తో స్నికో మీటర్ ఆధారంగా డీఆర్ఎస్ లో తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరం వ్యక్తం చేశాడు. కామెంటేటర్లు కూడా తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ కేఎల్ రాహుల్ అవుట్ కాదనే రీతిలో... ## Pages - [Videos](https://teluguheadlines.com/videos/) - [Health](https://teluguheadlines.com/health/) - [National](https://teluguheadlines.com/national/) - [Telangana](https://teluguheadlines.com/telangana/) - [AP](https://teluguheadlines.com/ap/) - [Entertainment](https://teluguheadlines.com/entertainment/) - [International](https://teluguheadlines.com/international/) - [Contact Us](https://teluguheadlines.com/contact-us/): పీపుల్స్ మీడియా నెట్ వర్క్స్ ఆధ్వర్యాన నిర్వహణ.ద న్యూస్ తెలుగు చానెల్స్ తో పాటుగా తెలుగు హెడ్ లైన్స్ కూడా నడుస్తోంది. Our Location: Vijayawada Address: Amaravati, Andhra Pradesh Phone 96180 89388 Social Follow us via: Twitter The News తెలుగు (@TheNewsTel) / X, youtube: (2) The News తెలుగు – YouTube Facebook: (1) Facebook Instagram: Instagram Mail: peoplesmedianetworks@gmail.com - [Privacy Policy](https://teluguheadlines.com/privacy-policy/): Who we are Suggested text: Our website address is: http://localhost/blaze/news-block-pro. Comments Suggested text: When visitors leave comments on the site we collect the data shown in the comments form, and also the visitor’s IP address and browser user agent string to help spam detection. An anonymized string created from your email address (also called a hash) may be provided to the Gravatar service to see if you are using it. The Gravatar service privacy policy is available here: https://automattic.com/privacy/. After approval of your comment, your profile picture is visible to the public in the context of your comment. Media Suggested... [comment]: # (Generated by Hostinger Tools Plugin)