విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు

విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.

పరారయిన యువతులంతా గురువారం మధ్యాహ్నం భోజన సమయంలో స్వధార్ హోం నిర్వాహకులపై కారంపొడి జల్లి కత్తితో బెదిరించి పారిపోయినట్లు వసతిగృహం ఇంచార్జ్ లింగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి సీఐ సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హోం నుంచి ఇటీవల పదే పదే యువతులు పారిపోతుండడం విశేషంగా మారింది. నిర్వాహకుల తీరు మీద సందేహాలు పెరుగుతున్నాయి. తగిన సదుపాయాలు లేకపోవడంతో అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *