కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన
కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్…
చంద్రబాబు సామర్థ్యం మీద నమ్మకం ఉందని చెబుతూనే తాము కదులుతుండగానే అమరావతి పూర్తి చేయాలని బహిరంగంగానే చెప్పడం ద్వారా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తిగా వ్యాఖ్యానించారు. అమరావతి పనుల మీద ప్రజల్లో ఇప్పటికే సందేహాలున్నాయి. ఇప్పుడు వెంకయ్య కూడా అలాంటి అనుమానాలు రేకెత్తించడం ఏపీ రాజధాని భవితవ్యం మీద సందేహాలు బలపడుతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల అమ్మకానికి పూనుకుంది. టెండర్లు పిలుస్తోంది. పీపీపీ మోడల్ అంటూ ప్రైవేటుపరం చేస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విపక్షం హెచ్చరిస్తున్నా కూటమి సర్కారు పట్టనట్టే ముందుకెళ్తోంది. ఏపీలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇక రావని చాటుతోంది. పూర్తి వివరాలు కింద వీడియోలో
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎస్సీలు, కాపుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాటి ఫ్లెక్స్ వివాదం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో ఆర్ఎంపీ మీద దాడి అదే కోవలోకి వస్తుంది. దానికి తోడుగా కైకలూరు దొనపాడు ఎస్సీ పేట మీద జనసేన శ్రేణుల దాడి వివాదంగా మారింది. అదే సమయంలో జనసేన శ్రేణులు పలువురు ఎస్సీ ప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. జడ…
అమరావతిలో రాకపోకలకు కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం ఆరేళ్ల పాటు ఒక్క అడుగు కూడా పడలేదు. ఏపీ రాజధాని నగర నిర్మాణంలో ముఖ్యమైన రోడ్డు పనులు సాగకపోవడంతో సీఎం, చీఫ్ జస్టిస్ సహా అంతా అవస్థలు పడ్డారు. కరకట్ట రోడ్డుని ఆశ్రయించక తప్పని స్థితిలో సాగారు. అయితే రైతులు భూములివ్వకపోవడం వల్ల వెంకటపాలెంలో ఆగిన రోడ్డులో చిన్న పాటి కదలిక వచ్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడండి
అమరావతిని సింగపూర్, షాంఘై, టోక్యో తరహాలో నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు వాస్తవంలోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. అమరావతిని 33వేల ఎకరాల్లో నిర్మితే అదో చిన్న మునిసిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం వెల్లడించడం ఆసక్తిగా మారింది. అసలు ఆయనేమన్నారు..ఇప్పుడెందుకు ఇలా అంటున్నారన్నది చర్చనీయాంశం. Full Details In Video Link:
అమరావతి నగరంలో ఇప్పటికే ఉన్న భూముల్లో మాత్రమే నిర్మించే ప్రాంతం ఓ చిన్న మునిసిపాలిటీ స్థాయికి మాత్రమే పరిమితమవుతుందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దాని వెనుక అసలు లక్ష్యం ఏంటి, అమరావతి ప్రాంతం మీద అనుమానాలెందుకు బలపడుతున్నాయి. వీడియో లింక్ క్లిక్ చేయండి పూర్తి విశ్లేషణ కోసం
“Public opinion is everything. With public sentiment, nothing can fail; without it nothing can succeed.” ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని అంతా అంగీకరిస్తారు. కానీ జనాభిప్రాయానికి విలువనివ్వకపోతే ఏమీ సాధించలేమన్న అబ్రహం లింకన్ చెప్పిన మాటలను అధికారం దక్కగానే విస్మరిస్తారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రత్యేకమైనవి. ఏడాది పాలనకి గడువు ఉండగా నిర్వహించిన చిన్న ఎన్నికే అయినప్పటికీ దాని…
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ దాటి వెళ్లి..మళ్లీ తిరిగి వచ్చి బంతులు పడుతున్నారు. టీ20 వరల్డ్…
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్‌కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు…
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ పనిబడతారని అంతా ఆశించారు. కానీ భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. పట్టు చిక్కుతున్న దశలో జారవిడిచేసేసింది. అమెరికా ఆదేశాలతో గట్టి ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసింది. వాస్తవానికి సైనిక చర్యకు ముందే పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు దౌత్య యుద్ధం జరగాలి. ప్రపంచమద్ధతు కోరాలి. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుని పలువురిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలించారు. దాని వల్ల ప్రయోజనమెంత అన్నది ప్రశ్నార్థకమే….