సాగనంపాల్సింది రోహిత్ నే కాదు, అతడిని కూడా!

టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మను సాగనంపేసింది. కీలకమైన చివరి టెస్టులో ఆయన్ని పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ బుమ్రాకే సారధ్యం దక్కింది. పెర్త్ టెస్టులో గెలుపుబాట పట్టించిన సారధికి చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ రావడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి, సిరీస్ ను డ్రా చేస్తారా అన్నది ఆసక్తికరం. సిరీస్ మధ్యలో కెప్టెన్ ను పక్కన పెట్టడం టీమిండియాలో అరుదైన అంశం. గతంలో 1985లో కపిల్ దేవ్…

Read More

స్నికో మీటర్ ముఖ్యమా, డిఫ్లెక్షనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ టెస్టులో టీమిండియా బ్యాటర్ యశశ్వీ జైస్వాల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. స్నికో మీటర్ లో ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోయినా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా, ప్యాట్ కమిన్స్ డీఆర్ఎస్ కోరడంతో దానిని అవుట్ గా నిర్దారించారు. దాని మీద బ్యాటర్ కూడా అభ్యంతరం పెట్టినా అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది….

Read More

నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?

టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది….

Read More

R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ ఇక సెలవు చెప్పేశాడు!

టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు. ఊహించినట్టుగా ఈసిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తే అందుకు భిన్నంగా మూడో టెస్ట్ ముగియగానే తన నిర్ణయాన్ని అశ్విన్ ప్రకటించాడు. బ్రిస్టేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్ ప్రకటించడంతో టీమిండియాలో ఓ శకం ముగిసినట్టుగా భావించాలి. గతంలో ధోనీ కూడా ఇదే రీతిలో సిరీస్ మధ్యలో తన రిటైర్మెంట్ ప్రకటించిన అనుభవం ఉంది. ఆసీస్ గడ్డ మీద బోర్డర్…

Read More

విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?

టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా…

Read More

కెప్టెన్సీ నుంచి ఊస్టింగ్ పక్కా! రోహిత్ కెరీర్ ముగింపు?

టీ20 వరల్డ్ కప్ లో జట్టుని ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. తన ఆటతీరుతో పాటుగా జట్టుని నడిపించే విషయంలోనై ఘోరంగా విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇక రోహిత్ శర్మ తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయినట్టుగా అంతా భావిస్తున్నారు. ఆయన తప్పుకోకపోతే తొలగించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లనుంచి వైదొలుగుతూ ప్రకటన చేశారు….

Read More

దొమ్మరాజు గుకేశ్ విజయానికి మూలం కోహ్లీ ఫిట్ నెస్ మంత్రం అదే!

2011లో టీమిండియా చివరి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆనాడు టీమిండియా విజయంలో తెరవెనుక కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియా హాకీ మెడల్ సాధించింది. అప్పుడు కూడా టీమ్ సక్సెస్ లో ఆయన పాత్ర ఉంది. తాజాగా గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చిన్నవయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆ చిన్నోడి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆటలు వేరు..ఆటగాళ్ళు వేరు. కానీ ఆయన విజేతలను తయారుచేయడంలో…

Read More

ఈ క్రికెటర్ త్వరలో డాక్టర్ అయిపోతున్నాడట..!

జాన్ కోరా,సీనియర్ జర్నలిస్ట్ క్రీడాకారులు ఏం చదువుకున్నారు? సచిన్ టెన్త్, కోహ్లీ ఇంటర్, ధోనీ బీఏ ఫెయిల్ అంటూ చాలా సార్లు మనం సోషల్ మీడియాలో పోస్టులు చూశాం. క్రికెటర్లు, సినిమా నటులు, కళాకారులు చాలా మంది పెద్దగా చదువుకోలేదని.. అయినా వారు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడం లేదా అని ప్రశ్నించే వారినీ చూశాం. కానీ.. అది అన్ని వేళలా సాధ్యం‌ కాదు. ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా పిల్లల మనసుల్లో చదువుకు విలువే లేదనేది నాటుతున్నామని…

Read More

బ్యాటర్ల తీరు మారకుంటే సిరీస్ గోవిందా! షమీ ఎప్పుడొస్తాడు?

ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సాధించిన రికార్డ్ విజయం మరచిపోకముందే పింక్ బాల్ టెస్టులో ఓటమి పాలయ్యింది. బుమ్రా నాయకత్వంలో గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైడ్ లో పరాభవం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా బ్యాటింగ్ పేలవ ప్రదర్శనతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో చరిత్రలో వేగంగా ముగిసిన టెస్ట్ గా ఈ మ్యాచ్ మిగిలిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ముఖ్యంగా సీనియర్లు…

Read More

అనుష్క శర్మ ఉంటేనే కోహ్లీ సెంచరీలా?

విరూష్క అంటూ పిలుచుకునే ఈ జంట గురించి అనేక ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ కి తెలుసు. తాజాగా టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మరో విషయం వెలుగులోకి తెచ్చాడు. అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉంటే విరాట్ రెచ్చిపోతుంటాడంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు గతంలో జరిగిన పరిణామాలను ఉదహరించాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో విరాట్ సెంచరీ చేసిన సమయంలో అనుష్క శర్మ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. 2015 లో రావిశాస్త్రి మన…

Read More