డ్యుయెల్ రోల్స్ చేయడానికి ఇది సినిమా కాదు పవన్..!
కొన్ని సినిమాల్లో హీరో , విలన్ ఒకడే ఉంటారు. హీరో, విలన్ మాత్రమే కాదు..కమెడియన్ పాత్ర సైతం తనే పోషించిన…
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినే షనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్ తో విబేధించి ఆపార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం…
ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను…
రుషికొండ ప్యాలెస్ విషయంలో అధికమొత్తంలో ఖర్చు చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం జైలులో పెట్టాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కేవలం సొంత ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా నిర్మాణం జరిగిందని మండిపడ్డారు. వేల రూపాయలు వెచ్చించిన ఈ భవనం ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా రుషికొండ ప్యాలెస్ గురించి వేసిన ప్రశ్నకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమాధానమిచ్చారు. రుషికొండ మొత్తం భవనాలు,…
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్డీయే కూటమి గెలుచుకుంది. కూటమిలో టీడీపీ-15, జనసేన-5, బీజేపీ ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. మూడు ఎంపీ సీట్లను కూడా తలో ఒకటి చొప్పున మూడు పార్టీలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాయి. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇప్పటి వరకూ కేటాయించిన వాటిలో బీసీలకు…
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సీఎం ఇల్లు అనే అంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. నిజానికి చెప్పాలంటే సీఎం చంద్రబాబు నివశిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం. ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్న నదీ గర్భంలో ఉన్న భవనం. అయినా దానిని జనం అంగీకరించేలా చేయడం సాధారణ నైపుణ్యం కాదు. అది నేరం కాదని జనాలను నమ్మించడం చిన్న విషయం కాదు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన భవనంలో…
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. “ప్రణాళికను ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం విశాఖ,విజయవాడకు మెట్రో రైల్ రాకుండా కక్షపూరితంగా పక్కన పెట్టేసింది. విశాఖలో భోగాపురం ఎయిర్…