వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు

వాలంటీర్ల వ్యవస్థ అమలుపై ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన అధినేతలు ఊదర గొట్టారు.వైసిపి ప్రభుత్వం ఇస్తున్న 5000 జీతం కంటే మెరుగైన గౌరవ వేతనం ఇస్తాం.వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వాలంటిర్లలో డిగ్రీ , పీజీ చేసిన వారు కూడా ఉన్నారు.వారికి శిక్షణ ఇచ్చి సాప్ట్ వేర్ ఉద్యోగులుగా తీర్చి దిద్దుతాము.తమపై వైసిపి చేసే ప్రచారాన్ని నమ్మకండని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను కోరారు.ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది.మంత్రులకు శాఖలు కేటాయింపులో వార్డు వాలంటర్ వ్యవస్థ శాఖను తీసుకువచ్చారు.ఎమ్మెల్యే గా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలా వీరాంజనేయ స్వామి కి ఆ శాఖను కేటాయించారు.
వ్యవస్థలో సాంకేతిక సమస్యలు అంటూ దాటవేత
ఎన్డీయే ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ విధి విధానాలు అని ప్రకటించారు.35 ఏళ్లు లోపు ఉన్న వారు వలంటర్ ఉద్యాగానికి అర్హులు. గ్రామానికి ఐదు మంది మాత్రమే ఉంటారు.జీతం 10000 రుపాయలు గా నిర్ణయించారు.ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలేగా అవుతుంది అమలులోకి వస్తుంది అని అందరు అభిప్రాయపడ్డారు.కానీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లుకు జీతాలు పెంచుదాము అంటే జీవోలు లేవని చెప్పకనే చెప్పేశారు. ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డు లో ఉంటే రద్దు చేయచ్చు..కానీ వాళ్ళు వ్యవస్థలోనే లేరు అంటూ తేల్చేసారు.నాడు వాలంటీర్ వ్యవస్థ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..నేడు అదే ధోరణిని అవలంభిస్తున్నారు అంటూ రాజకియ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే…వాలంటీర్ వ్యవస్థ కు చంద్రబాబు ,పవన్ కళ్యాణ లు మంగళం పడేస్తారని తాము చేసిన వ్యాఖ్యలే నేడు నిజం అయ్యాయని అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. సిఎం చంద్రబాబు అదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని…త్వరలోనే సుపర్ సిక్స్ పై కూడా ఎన్డీయే విఫలం చెందుతుందని వైసిపి విమర్శిస్తోంది.