
ట్రంప్- మస్క్ బంధం చెడింది! ‘బ్రొమాన్స్’ ముగిసింది!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్‌కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు…