April 2026
అమరావతి – నవారాయ్‌పూర్ రెండు నగరాల అనుకూల, ప్రతికూలతలేంటి?
ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ నగరాల అభివృద్ధి విషయంలో భిన్నమైన అనుభవాలున్నాయి. అభివృద్ధి విషయంలోనే భిన్న పాఠాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తే విజయవాడ వంటి నగరాలను తోసిరాజని విశాఖపట్నం దూసుకుపోయిన తీరు అందుకు ఓ కొలమానం. దేశవ్యాప్తంగా గాంధీనగర్, నవా రాయ్‌పూర్ అనుభవాలున్న సమయంలోనే నోయిడా లాంటివి కూడా మనకి కనిపిస్తాయి. ఇలాంటి అనేక నగరాలను పరిశీలిస్తే అర్థమవుతున్న అంశం ఒక్కటే. ఉపాధి కల్పన, సామాన్యులకు నివాసయోగ్యంగా ఉండే ప్రాంతాలు మాత్రమే అభివృద్ది అయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులన్నీ కునారిల్లిపోతున్నాయి. హైదరాబాద్ కి…
గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ: అమరావతి కన్నా ముందుగా కట్టిన నవా రాయ్‌పూర్ నేర్పుతున్న పాఠమేంటి?
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలు గుర్తురాక తప్పదు. ఎందుకంటే రాజధాని అంటే అందమైన భవనాలు, అదిరిపోయే రోడ్లు, ఆకట్టుకునే నిర్మాణాలు మాత్రమే కాదని..అక్కడ నివశించే జనాలని పాలకులకు అర్థమయ్యేలా చెబుతున్న పాఠం ఇది. ఎంత అందంగా డిజైన్ చేశామో, ఎంత అద్భుతంగా నిర్మించామో, ఎంత పెద్దమొత్తంలో ఖర్చు చేశామో అన్నది ఏ నగరానికి కొలబద్ధ కాదనే వాస్తవాన్ని చాటుతున్న విషయమిది. దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణానికి చత్తీస్‌ఘడ్ శ్రీకారం చుట్టింది….