పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత

ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన…

Read More

బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?

గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

స్నికో మీటర్ ముఖ్యమా, డిఫ్లెక్షనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ టెస్టులో టీమిండియా బ్యాటర్ యశశ్వీ జైస్వాల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. స్నికో మీటర్ లో ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోయినా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా, ప్యాట్ కమిన్స్ డీఆర్ఎస్ కోరడంతో దానిని అవుట్ గా నిర్దారించారు. దాని మీద బ్యాటర్ కూడా అభ్యంతరం పెట్టినా అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది….

Read More

నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?

టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది….

Read More

చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది. తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

Read More

రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు…

Read More

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!

వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల…

Read More

అల్లు అర్జున్ కి శత్రువులెక్కువయ్యారా? ఈ కేసులో తనకిపోయిందెంత?

సమాజంలో ఏ రంగంలో ఎదిగిన వాళ్లయినా ఎదుటి వాళ్లకు ఈర్ష్యగానే ఉంటుంది. అందులోనూ తమ కళ్లెదురుగా ప్రస్థానం మొదలెట్టి, తాము ఊహించని స్థాయికి ఎదిగిపోతుంటే మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అదే కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడు. అంటే అతని కంటే ముందు బాధ్యులు మరో పది మంది ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదుకాని అసలు అంశం ఈ విషయంలో పోలీసులు పాత్ర కూడా…

Read More

ఏబీఎన్ ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారా?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీగా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అధినేతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండే వేమూరి రాధాకృష్ణ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన రెండో పెళ్లి చుట్టూ చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన పెళ్లి మీద పలు కథనాలు వచ్చాయి. చివరకు పెళ్ళి పూర్తయ్యిందంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏబీఎన్ ఆర్కే భార్య, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేసిన కనకదుర్గ కొన్నేళ్ల క్రితం మరణించారు….

Read More