పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత

ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన…

Read More

ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు

దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా…

Read More

రాజ్యసభలో డబ్బు కట్టలు

భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు. అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్‌…

Read More

కంగనా కథ నమ్మేసి అభాసుపాలయిన ఆంధ్రజ్యోతి!

ఆంధ్రజ్యోతి తప్పులో కాలేసింది. నిర్ధారణ లేని వార్త రాసి చేతులు కాల్చుకుంది. మరి తప్పిదాన్ని సరిదిద్దుకునేలా రేపు పాఠకులకు అసలు వాస్తవం చెబుతుందో లేదో చూద్దాం. అందరికీ నీతులు చెప్పే బల్లి కుడితిలో పడిందన్న నానుడి చందంగా వేమూరి రాధాకృష్ణ పత్రిక తీరు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెక్యూరిటీలో మహిళా అధికారి ఉన్నట్టుగా ఫోటోతో వార్త ఇచ్చింది. కానీ అది అది వాస్తవం కాదు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాడీగార్డ్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More