Author

మహానాడు వక్తలకు రాజబోగం.. ఐటిడిపికి మొండిచెయ్యి

నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఐటిడిపి సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండవ జాబితాల్లో ఐటిడిపి నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోడంపై మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. వైసిపి అధికారంలో ఉండగా తాము కూడా కేసులు ఎదుర్కొన్నామని..పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవులు రావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. వైసిపి సోషల్ మీడియా వలన ఐదేళ్లుగా వ్యక్తిగతంగా తాము చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేపోతున్నారాని…

Read More

వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు

వాలంటీర్ల వ్యవస్థ అమలుపై ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన అధినేతలు ఊదర గొట్టారు.వైసిపి ప్రభుత్వం ఇస్తున్న 5000 జీతం కంటే మెరుగైన గౌరవ వేతనం ఇస్తాం.వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వాలంటిర్లలో డిగ్రీ , పీజీ చేసిన వారు కూడా ఉన్నారు.వారికి శిక్షణ ఇచ్చి సాప్ట్ వేర్ ఉద్యోగులుగా తీర్చి దిద్దుతాము.తమపై వైసిపి చేసే ప్రచారాన్ని నమ్మకండని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను కోరారు.ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది.మంత్రులకు శాఖలు కేటాయింపులో వార్డు వాలంటర్…

Read More

రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?

ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు…

Read More

లౌకిక రాజ్యానికి ప్రతీకగా విశాఖ రాస్‌హిల్‌ … విశాఖ క‌న్నెమ‌రియ‌ గుడికి నాగుల‌చ‌వితి శోభ‌

భార‌తీయ‌త‌ సంస్కృతికి మూలం భిన్న‌త్వంలో ఏక‌త్వమే. వేల ఏళ్లుగా అది మ‌న సంస్కృతిలో జీర్ణించుకు పోయింది. కుల‌, మ‌త విభేదాలు వెర్రిత‌ల‌లు వేసే ఘ‌ర్ష‌ణ‌లు అక్క‌డ లేవు. ఆచారం, అనాచారం అసుంట‌సుంట వంటి విభ‌జ‌న రేఖ‌లు అక్క‌డ భూత‌ద్ధం పెట్టినా క‌నిపించ‌వు. ఇదంతా ఆధునిక నాగ‌రిక స‌మాజానికి దూరంగా ఎక్క‌డో అడ‌వుల్లోనో, ఏ కొండ కోన‌ల్లోనో అనుకుంటే త‌ప్పులో కాలు వేసిన‌ట్టే. అన్ని రంగాల‌్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మ‌హాన‌గ‌రంలోనే. అన్య‌మ‌త ప్ర‌చారం…

Read More

ఎన్డీయేను ఇరుకున పెడతారా? మళ్లీ మొహం చాటేస్తారా?

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుతిరి ఐదు నెలలు గడిచిపోయింది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన సుపర్ సిక్స్ లోని కీలక హామీలు ఇంకా అమలులోకి రాలేదు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి కింద 20,000 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి కింద 3000 , 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు వంటి కీలక హామీలు అమలులోకి రాలేదు.ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాల్సిన ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం…

Read More

వైసిపి విమర్శలకు పవన్ ఊతమిచ్చారా?

రాష్ట్రంలో నిన్నటివరకు అధికార ఎన్డీయేకు వైసిపికు మధ్య విమర్శలు, సవాళ్లు నడిచాయి.కానీ నేడు బహిరంగ సభ వేదికపై సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అధికార భాగస్వామి మంత్రి పై విమర్శలు గుప్పించారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో అశ్రద్ధ వహిస్తే తానే హోం మంత్రిత్వ శాఖ బాధ్యతను తానే తీసుకుంటానని హెచ్చరించారు. ఇన్నాళ్లు ఎన్డీయే మిద వైసిపి చేసిన విమర్శలనే నేడు పవన్ గుర్తు చేశారు. ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలలు కాలంలోనే…

Read More

బాలినేని బల ప్రదర్శనకు అడ్డంకులు ఏమిటి ?

బహిరంగ వేదికలపై టీడిపి, జనసేన నాయకుల కోట్లాటలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు తల నొప్పిగా మారాయి. ఇలాంటి ఘటనల వలన… వలస నేతలను చేర్చుకునేందుకు టిడిపి జనసేనలు భయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదలయిన ఈ అసంతృప్త జ్వాలలు అన్నీ నియోజకవర్గాలకు విస్తరించాయి. ఒంగోలు, దెందులూరు, నెల్లిమర్ల,పిఠాపురం నియోజకవర్గాల బాటలో చాలా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి దాదాపు 50 రోజులు పైనే…

Read More

యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…

Read More

ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?

ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన…

Read More

అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More