వైసిపి విమర్శలకు పవన్ ఊతమిచ్చారా?
రాష్ట్రంలో నిన్నటివరకు అధికార ఎన్డీయేకు వైసిపికు మధ్య విమర్శలు, సవాళ్లు నడిచాయి.కానీ నేడు బహిరంగ సభ వేదికపై సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అధికార భాగస్వామి మంత్రి పై విమర్శలు గుప్పించారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో అశ్రద్ధ వహిస్తే తానే హోం మంత్రిత్వ శాఖ బాధ్యతను తానే తీసుకుంటానని హెచ్చరించారు. ఇన్నాళ్లు ఎన్డీయే మిద వైసిపి చేసిన విమర్శలనే నేడు పవన్ గుర్తు చేశారు. ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలలు కాలంలోనే 75 మహిళలపై అత్యాచారాలు జరిగాయని వైసిపి విమర్శిస్తోంది.చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది అని ధ్వజమెత్తుతుంది.కేవలం మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి పై కక్షతో దిశా పోలీస్ స్టేషన్లను తొలగించారని ఆరోపిస్తోంది.నేడు ఈలాంటి ఆరోపణలును పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ నిండు సభలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? తన శాఖలో పవన్ ఎలాంటి అశ్రద్ధ వహించలేదా? కర్నూలు జిల్లా కప్పట్రాల లో యురేనియం తవ్వకాలపై ఆ శాఖ కు సమర్ధించిన మంత్రిగా పవన్ ..ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా? జనసేన లో మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ లు పై ఎటువంటి ఆరోపణలు లేవా? బిజెపికి చెందిన ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పై లేవా? ఒక దళిత మహిళా మంత్రి పై ఎందుకు చులకనగా మాట్లాడారు అనే చర్చ నడుస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ వైసిపికి కొంత ఉపశమనం ఇచ్చి టిడిపిని ఇబ్బందుల్లో నెట్టేసారని రాజకియ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.