అనుష్క శర్మ ఉంటేనే కోహ్లీ సెంచరీలా?

విరూష్క అంటూ పిలుచుకునే ఈ జంట గురించి అనేక ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ కి తెలుసు. తాజాగా టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మరో విషయం వెలుగులోకి తెచ్చాడు.

అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉంటే విరాట్ రెచ్చిపోతుంటాడంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు గతంలో జరిగిన పరిణామాలను ఉదహరించాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో విరాట్ సెంచరీ చేసిన సమయంలో అనుష్క శర్మ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు.

2015 లో రావిశాస్త్రి మన ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ ఉన్న కాలం నాటి నిబంధన ప్రకారం కేవలం ఆటగాళ్ల భార్యలను మాత్రమే లాంజ్ లోకి అనుమతించేవారు. దాంతో విరాట్ కోహ్లీ కి అది గిట్టలేదు.

అప్పటికింకా తమకు పెళ్లికాకపోయినా అనుష్కతో కోహ్లీ డేటింగ్ లో ఉన్నాడు. ఆసమయంలో బోర్డు నిబంధన తనకు ఇబ్బందిగా ఉందంటూ నేరుగా కోచ్ ముందు ప్రస్తావించాడు. అయినా రవిశాస్త్రి అంగీకరించలేదు. చివరకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని అనుష్కను ప్లేయర్ల లాంజ్ కి తీసుకురాగలిగారు.

ఆరోజు విరాట్ తన బ్యాట్ కి పనిచెప్పాడు. ఏకంగా 160 రన్స్ సాధించి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను గెలిపించాడు. దానిని గుర్తు చేసుకున్న రవిశాస్త్రి పెర్త్ లో కూడా స్పెషల్ లాంజ్ లో అనుష్క శర్మ, వారి కొడుకు అకాయ్ తో కలిసి ఉన్న వీడియోను ప్రస్తావించాడు. పైగా చాలాకాలం తర్వాత కోహ్లీ టెస్ట్ సెంచరీ సాధించడంతో టీమిండియా పెర్త్ లోఘన విజయానికి తోడ్పడడం విశేషం అంటూ పేర్కొన్నాడు. కొందరికి వారి భార్యల ద్వారా ప్రేరణ లభిస్తుందంటూ పేర్కొన్న శాస్త్రి మాటలు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *