ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. తాత్కాలిక కెప్టెన్ జస్ఫ్రిత్ బుమ్రా అధ్భుతంగా రాణించి జట్టుని విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా సెనా దేశాల గడ్డ మీదనే అత్యధిక తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో ఏకంగా 295 రన్స్ ఆధిక్యంతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత సీజన్ లో జరిగిన పెర్త్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

న్యూజీలాండ్‌తో సొంత గడ్డపై 0-3 తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. ఆసీస్ గడ్డపై జరుగుతున్న బీజీటీ సిరీస్‌పై ఇండియాపై పూర్తిగా నమ్మకం పోయింది. ఆస్ట్రేలియాలోని పేస్ ట్రాక్స్‌పై ఇండియా తేలిపోతుందని భావించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ చూశాక.. రెండు రోజుల్లోనే మ్యాచ్ చుట్టేస్తారని అనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో యువ క్రికెటర్ జైస్వాల్ పోరాటం, క్లాసీ కోహ్లీ సెంచరీ కలిసి.. ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల విజలక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆస్ట్రేలియా జట్టు కేవలం 238 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు 295 పరుగల తేడాతో విజయం సాధించింది.

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు లేకపోయినా.. అశ్విన్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు లేని బౌలింగ్ లైనప్‌తోనే కెప్టెన్ బూమ్రా మ్యాజిక్ చేశాడు. కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇక రెండో టెస్ట్ వచ్చే నెల 6 నుంచి ఆడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ మ్యాచ్ జరగబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *