వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని విమర్శించారు. ఐదు నెలల కాలంలోనే ఎన్డీయే ప్రభుత్వం సూపర్ ప్రభుత్వం కాదని ..సూపర్ ఫ్లాప్ ప్రభుత్వమని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 77 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉంటే కూటమి ప్రభుత్వం అరకోటి మంది లబ్ధి దారులపై కోత విధించిందని మండిపడ్డారు. ప్రతి ఇంటికి ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి.. ఈ ఏడాదికి ఒక సిలిండర్ తోనే సరిపెట్టారని విమర్శించారు.పవన్ కళ్యాణ్ ఎవర్ని తొక్కి పెట్టీ నార తీస్తారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం చంద్రబాబు, లోకేష్ లను పవన్ కళ్యాణ్ తొక్కి పెట్టీ నార తీయాలని సవాల్ విసిరారు.ఫేక్ న్యూస్ లకు లోకేష్ ఫ్యాక్టరీ అని ఎద్దేవా చేశారు

కూటమి ప్రభుత్వం వచ్చాక..లా అండ్ ఆర్డర్ లో విఫలం చెందింది.ప్రభుత్వ స్కూళ్లు మూతబడ్డాయి.ప్రభుత్వ వైద్యం పేదవాడికి అందకుండా పోయింది. పోర్టులు , వైద్య కళాశాలలు అమ్మకానికి పెట్టేసారని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగితే అందులో కుట్ర కోణం ఉందని టిడిపి అసత్య ఆరోపణలు చేస్తుంది.2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయ్యింది. 2014 లో కార్ ప్రమాదంలో నందమూరి జానకి రామ్ మరణించారు. ఇలాంటి ఘటనలు వెనుక కూడా చంద్రబాబు కుట్ర కోణం ఉందా అని విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *