ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?
తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి.
ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు.
“మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు చేయిస్తారు. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకు, ఈ భౌతిక పదార్థాలు,వస్తువులకు అతీతంగా ఏదో శక్తి ఈ సమస్థాన్ని నడిపిస్తూ ఉందని అనిపించేది. అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. నా కన్వర్షన్ కి ప్రధాన కారణం మత్రం, నా తల్లి మృతి చెందడం అని చెప్పొచ్చు. ” అంటూ యువన్ శంకర్ రాజా వెల్లడించారు.
ఇస్లాం లోకి మారాలనుకుంటున్నానని డిసైడ్ చేసుకున్నాకే మా నాన్నగారికి చెప్పాను. నువ్వు మారడం నాకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. మా అన్న(కార్తిక్ రాజ),వదినలు మాత్రం “నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యమని” సపోర్ట్ చేశారు. 2014 లో ఇస్లాం లోకి కన్వర్ట్ అయ్యాను. అంటూ గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను తెలిపారు. నాటి నుంచి ఆయన తనకు నచ్చిన మతంలో తండ్రికి దూరంగా ఉంటున్నారు.
అదే సమయంలో కొడుకు మతం మారిన తర్వాత ఇళయరాజా హిందూత్వానికి చేరువయ్యారు. బీజేపీ, మోదీ మద్ధతుదారుగా మారారు. తాజాగా ఆలయంలో ఆయన్ని అవమానించారన్న ప్రచారాన్ని కూడా ఆయన తిప్పికొట్టారు. అలాంటిది లేదంటూ వివరణ ఇచ్చారు.