వివాదాస్పద నిర్ణయానికి వెనుదిరిగిన రిషబ్ పంత్, టీమిండియా ఓటమి

న్యూజీలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టు మ్యాచుల్లో కూడా ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపల్యం టీమిండియా ఓటమికి కారణంగా మారింది.

అదే సమయంలో ముంబై టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ పోరాడిన రిషబ్ పంత్ కీలక సమయంలో అవుట్ కావడంతో జట్టు విజయావకాశాలు దెబ్బతీసింది. డీఆర్ఎస్ లో పంత్ ను అవుట్ గా ప్రకటించారు. అయితే బ్యాట్ ను బాల్ తాకిందా లేదా బ్యాట్ ప్యాడ్ ను టచ్ చేసిందా అన్నది స్పష్టత లేకపోయినా అవుట్ ఇవ్వడం మీద పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఏబీ డివిల్లీర్స్ స్పందిస్తూ గ్రే ఏరియాలో అలాంటి నిర్ణయం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. చేతిలో నాలుగు వికెట్లు ఉండగా 40 రన్స్ చేయాల్సిన దశలో పంత్ అవుట్ కాగా ఆ తర్వాత 16 పరుగులకే చివరి 3 వికెట్లను కోల్పోవడంతో టీమిండియా 147 రన్స్ చేధించలేక చతికిలపడింది.

మరోవైపు న్యూజీలాండ్ చరిత్ర సృష్టించింది. ఇండియాలో టీమిండియాను మూడు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన తొలిజట్టుగా రికార్డులకెక్కింది. మూడు టెస్టులను కోల్పోయిన తరుణంలో ఇక టీమిండియా వరుసగా మూడోసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కి చేరాలన్న కలలు కఠినం చేసుకుంది. తదుపరి ఆసీస్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాల్సిన సిరీస్ లో ఇలాంటి బ్యాటింగ్ ఫెర్మార్మెన్స్ తో గట్టెక్కడం కష్టం కాబట్టి వచ్చే ఏడాది జరిగే ఫైనల్స్ కి టీమిండియా చేరుకోవడం గగనంగా మారింది.

రోహిత్ శర్మ, గంభీర్ కాంబినేషన్లో జట్టు చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నట్టు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ను 8వ నంబర్ లో బ్యాటింగ్ కి పంపించడం, టీమ్ ఎంపిక సహా అనేక నిర్ణయాలు బెడిసికొట్టి జట్టుని ఘోరపరాజయం బాట నడిపించినట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *