చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది.
తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి రాసిన లేఖ పోలీస్ గ్రూప్ ల్లో వైరల్ అవుతూ, సంబంధిత శాఖ ఉద్యోగుల్లో చర్చనీయాంశమయ్యింది.
ఆ లేఖలో ఇలా ఉంది..
సార్ నమస్కారం సార్.సీఎం సార్ గారికి డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి అందరికీ నమస్కారం. సార్ నా పేరు దేవేంద్రారెడ్డి. నేను కడప జిల్లా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను.సార్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 7 నెలలు అయినది. మేము ఎంతగానో ఎదురుచూస్తున్న పాత బకాయిలు.. SLS , ASLS, T.A, DAగానీ ఐఆర్ గానీ జీపీఎఫ్ లోన్ గాని APGLI LOAN గాని, అరియర్స్ ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని అందరం అనుకున్నాం. కానీ ఏడు నెలలు అయిపోతున్నా కూడా ఇంతవరకు వీటిలో ఏ ఒక్కటి కూడా మాకు అందలేదు.
ఎందుకు సార్ మా మీద చిన్న చూపు?సాక్షాత్తూ సీఎం ఎన్. చంద్రబాబే త్వరలో పోలీసులకు అందరికంటే ముందుగా క్లియర్ చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు చేయలేదు. మేము ఈ రోజు పడతాయి. రేపు పడతాయి. అని ఎదురు చూస్తూ, చాలా ఆవేదనకు గురవుతున్నాం. సార్ నాలాంటి మధ్యతరగతి పోలీసులు చాలా మంది బాధపడుతున్నారు సార్.
కనీసం క్రిస్మస్ కు పై వాటిలో ఏ ఒక్కటి అయినా పడతాయి. అని ఎదురు చూశాం సార్. కానీ ఏమీ పడలేదు కనీసం మా అవసరాలకు మా జీతం నుండిచి RECOVERY చేసుకున్న APGLI గాని GPF నుంచి loan పెట్టుకుంటే… అదికూడా pendibg పెడితే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్? మీ ఉద్దేశంలో ఎప్పుడు వదలాలి అనుకుంటున్నారు సార్. అదేదో చెప్తే దాన్ని బట్టి మేము అప్పులైనా చేసుకుంటాం సార్. ఇప్పటికే అప్పులపాలయ్యాం సార్.
అసోసియేషన్ వాళ్లు మూడు నెలలకు ఒకసారి వస్తారు అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. సానుకూలంగా స్పందించారని చెప్పి, ఒక వీడియో పెట్టి, మీడియా ముందు వస్తారు. మళ్ళీ కనపడరు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత ఒక రిప్రెజెంటేషన్ పట్టుకుని మళ్లీ సేమ్ డైలాగు చెబుతూ సానుకూలంగా స్పందించారు. త్వరలో వస్తాయి మీకు అని అంటారు. వెళ్లిపోతారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పడలేదు మేము ఎవరిని అడగాలి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మీరే చెప్పాలి సార్.బాధతో మీ పోలీసులు. అని రాశారు.
వాట్సప్ లో వైరల్ అవుతున్న ఈ లేఖను రాసిన దేవేందర్ రెడ్డి తీరు ఆసక్తిగా మారింది. ఆయన మీద పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నట్టు సమాచారం. వాస్తవ సమస్యలను వెల్లడించినందుకు గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. దేవెందర్ రెడ్డి మీద క్రమశిక్షణా చర్యలు తప్పవనే ప్రచారం సాగుతోంది. అయితే సమస్యలు విన్నవించినందుకే చర్చలు తీసుకున్నారన్న అభిప్రాయం కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.