ఏబీఎన్ ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారా?
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీగా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అధినేతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండే వేమూరి రాధాకృష్ణ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన రెండో పెళ్లి చుట్టూ చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన పెళ్లి మీద పలు కథనాలు వచ్చాయి. చివరకు పెళ్ళి పూర్తయ్యిందంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఏబీఎన్ ఆర్కే భార్య, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేసిన కనకదుర్గ కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆ తర్వాత ఏబీఎన్ ఆర్కే హైదరాబాద్ కే చెందిన ఓ డాక్టర్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్టు సోషల్ మీడియాలో గుప్పుమంది. చివరకు ఆర్కే రెండో పెళ్లి గురించి ఆయన ఇంట్లో వివాదం కూడా మొదలయ్యిందనే రీతిలో కొందరు పోస్టులు చేశారు.
అలాంటి వివాదాలన్నింటికీ ముగింపు పలికి ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారనే అంశాన్ని చాటుతూ తెలంగాణా ఆవాజ్ అనే హ్యాండిల్ నుంచి అప్ డేట్ వచ్చింది.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో విడిగా కాపురం పెట్టారన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి కొంతకాలంగా పత్రిక కుమారుడికి, చానెల్ అల్లుడికి అప్పగించిన ఆర్కే ఆ రెండు కార్యాలయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. కేవలం తన కార్యక్రమం వరకూ మాత్రం చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఇంటి నుంచి కూడా బయటకు వచ్చారన్న కథనాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
రాధాకృష్ణ రెండో పెళ్లి విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని, కలిసి సాగాలని వారివురు అనుకుంటే అభ్యంతరం పెట్డడానికి లేదు. ఏవిధంగా చూసినా ఆయన పెళ్లి చేసుకుని ఉంటే హృదయ పూర్వక శుభాకాంక్షలు చెప్పాలి.