ఏలూరు మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు ఖరారు
ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాల పేరును “డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు”గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలపడంతో కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మెడకిల్ కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి బయో కెమిస్ట్రీలో విశేష పరిధోనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఎల్లాప్రగడను గుర్తుచేసుకునే నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.
ఇప్పటికే మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు ఖరారు చేశారు. గత ఏడాది ప్రారంభమయిన ఐదు కాలేజీల్లో రెండు కాలేజీలకు ఇద్దరు ప్రముఖుల పేర్లు పెట్టడంతో మిగిలిన రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల కాలేజీలకు కూడా పేర్లు పెట్టే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో కొన్ని కుటుంబ పార్టీలు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన సంస్థలకు, ప్రాంతాలకు సొంత పేర్లు పెట్టుకోవడం ద్వారా తమ వారసత్వాన్ని కొనసాగిస్తుంటే … తాము మాత్రం మహనీయుల స్ఫూర్తిని ముందుతరాలకు అందిస్తామని సత్యకుమార్ అన్నారు.