ఎస్సీలను జనసేన టార్గెట్ చేసిందా, అసలేం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎస్సీలు, కాపుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాటి ఫ్లెక్స్ వివాదం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో ఆర్ఎంపీ మీద దాడి అదే కోవలోకి వస్తుంది. దానికి తోడుగా కైకలూరు దొనపాడు ఎస్సీ పేట మీద జనసేన శ్రేణుల దాడి వివాదంగా మారింది. అదే సమయంలో జనసేన శ్రేణులు పలువురు ఎస్సీ ప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. జడ శ్రవణ్ కుమార్, ఐఏఎస్ విజయ్ కుమార్, పీవీ సునీల్ కుమార్ వంటి వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ నడుస్తోంది. దానికి కారణాలేంటన్నది ఈ వీడియోలో చూడండి