అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు…