విజయసాయిరెడ్డి తీరు విడ్డూరంగా ఉందా, వ్యవహారం తేడాగా ఉందా?
వైఎస్సార్సీపీని కీలక నేతలు వీడుతుంటే టీడీపీ సంతోషపడాలి. ప్రత్యర్థి బలహీనపడుతున్నాడని ఆనందించాలి. కానీ ఇప్పుడు పాలక టీడీపీలో కలవరం కనిపిస్తోంది. తాజా పరిణామాల మర్మం తెలియక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆఖరికి టీడీపీ అధినేత కూడా విజయసాయిరెడ్డి రాజీనామా మీద ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు విజయసాయి రెడ్డి మీద విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇదంతా ఆసక్తికర అంశం. వాస్తవానికి టీడీపీ నేతలు సందేహించడానికి తగ్గట్టుగానే సాయిరెడ్డి…