మహానాడు వక్తలకు రాజబోగం.. ఐటిడిపికి మొండిచెయ్యి
నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఐటిడిపి సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండవ జాబితాల్లో ఐటిడిపి నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోడంపై మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. వైసిపి అధికారంలో ఉండగా తాము కూడా కేసులు ఎదుర్కొన్నామని..పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవులు రావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. వైసిపి సోషల్ మీడియా వలన ఐదేళ్లుగా వ్యక్తిగతంగా తాము చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేపోతున్నారాని అధినేతకు గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తామని…మీడియా ముందు ఎవరూ పార్టీకి, కూటమికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్ధన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను వారు పక్కన పెడుతున్నారు.ఎన్నికల్లో సీట్లు సర్ధుబాటుకు టిడిపి, జనసేన, బిజెపి మధ్య కుదిరిన నిష్పత్తినే పదవులు పంపకాలుకు కూడా వర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే ఐటిడిపి నాయకురాలు అనుష ఉండవల్లి ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమెకు మద్దతుగా ఐటిడిపి నాయకులు స్వరం కలుపుతున్నారు. టిడిపి ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్బంగా మేనెలలో మహానాడు ను నిర్వహిస్తుంది. రెండవ జాబితాల్లో పదవులు దక్కిన వారిలో ఎక్కువ మంది మహానాడు వేదికపై జగన్మోహన్ రెడ్డిని విమర్శించవారే ఉండటం గమనార్హం. పార్టీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి,పట్టాభి రామ్,కావలి గ్రీష్మ, ఆనం వెంకట రమణ రెడ్డి లు మహానాడులో మంచి ప్రసంగాలు చేశారు.వారికి పదవులు దక్కాయి.కానీ పార్టీ కష్ట కాలంలో పోరాడిన తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు.