Editor

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More

ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?

పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ…

Read More

చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి మహుర్తం ఫిక్స్, భర్త ఎవరంటే?

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కుతోంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో వివాహ వేడుక జరుగుతోంది. ఆమె చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడబోతోంది. ఈ పెళ్లికి గోవా వేదిక కానుంది. కీర్తి సురేష్ తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించింది. మహానటి ద్వారా విశేష కీర్తి గడిచింది. ప్రతిభ కలిగిన నటిగా మన్ననలు పొందింది. అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. జాతీయ స్థాయి ఉత్తమనటిగానూ ఎదిగింది. తాజాగా తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్ 11న కుటుంబ సభ్యులు,…

Read More

భారీ వర్ష సూచన, రైతులు సర్దుకోండి!

నవంబర్ నెలాఖరులో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అంతా అప్రమత్తం కావాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. తర్వాత,…

Read More

రెహ్మాన్ కి మాటిచ్చిన రామ్ చరణ్ అక్కడికెళ్లారు..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ మాట నిలబెట్టుకున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట‌కు తగ్గట్టుగా వ్యవహరించారు. క‌డ‌ప ద‌ర్గాను సంద‌ర్శిస్తాన‌న్న చ‌ర‌ణ్‌.. ఇచ్చిన మాట ప్ర‌కారం క‌డ‌ప ద‌ర్గాలో జ‌రిగిన 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ ద‌ర్గాను ఎ.ఆర్‌.రెహ్మాన్‌ క్ర‌మ త‌ప్ప‌కుండా సంద‌ర్శిస్తుంటారు. 2024లో ఇక్క‌డ జ‌రిగే 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు చ‌ర‌ణ్‌ను తీసుకొస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చ‌ర‌ణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్‌…..

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More

జమిలీ వచ్చినా కూటమిగానే బరిలోకి, తేల్చేసిన చంద్రబాబు

ఏపీలో జమిలీ ఎన్నికల అవకాశాన్ని పాలకపక్షాలు కూడా గుర్తించాయి. దానికి తగ్గట్టుగా సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే పాలకకూటమిలోని మూడు పార్టీల మధ్య పలు చోట్ల విబేధాలు పొడచూపినప్పటికీ కూటమి మాత్రం కొనసాగుతుందన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులకు దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించినట్టు ఇప్పటికీ డీసీఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ సర్ధుకుపోవడమేనని టీడీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే…

Read More