పోలీసులే హద్దులు మీరితే ఎలా? క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ
అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలో పోలీసులు కొందరు చేస్తున్న అతి వివాదాలకు దారితీస్తోంది. అల్లు అర్జున్ ని విలన్ గా చిత్రీకరించాలని సీఎం సంకల్పించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వీరంగం చేసిన ఏసీపీ వంటి వాళ్లు అందులో పావులుగా మారారు.
ఆఖరికి సీనియర్ అధికారి, హైదరాబాద్ సీపీ కూడా ఆ క్రమంలో హద్దులు మీరి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు.సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలియజేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన దిల్లీ మీడియా మీద కొంత దురుసుగా ప్రవర్తించారు. అవి వైరల్ గా మారడం, దేశమంతా చర్చకు దారితీయడంతో ఆయన వెనక్కి తగ్గారు.
సంధ్య థియేటర్‌లో ఏం జరిగిందో తెలియజేస్తూ అక్కడి వీడియోలను విడుదల చేసిన క్రమంలో నేషనల్ మీడియా అల్లు అర్జున్ కి మద్ధతుగా నిలుస్తుందన్నట్టుగా మాట్లాడారు. అలాంటి ఘటనకు అండగా ఉందంటూ కుస్సుబుస్సులాడారు. దాంతో వ్యవహారం ముదురుతుందని తెలిసిన సీవీ ఆనంద్ వెనక్కి తగ్గడంతో విషయం సర్ధుమణిగనట్టయ్యింది.