టిటిడిలో హిందు ధర్మ రక్షకులు ఉన్నారా? : జడ శ్రావణ్
తిరుమల తిరుపతి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఎంతమంది సనాతనవాదులు ఉన్నారు? ఎంత మంది హిందు ధర్మాన్ని పరిరక్షించేవారు ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సమాధానం చెప్పాలని జై భీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కానిస్ట్యూషన్ బుక్ ను కోల్డ్ స్టోరేజ్ లో దాచి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసిన నారా లోకేష్ కూడా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. టిటిడి బోర్డు చట్టం ఏం చెబుతుంది? మీరు ఏం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పిన పవన్ కళ్యాణ్…ఇరోజు వరకు ఎందుకు దోషులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని ధ్వజమెత్తారు.
టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో చాలా మంది పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని విమర్శించారు. జ్యోతుల నెహ్రూ, ఏం.ఎస్ రాజులపై అనేక క్రీమినల్ కేసులు.. ఆదాయపు పన్నులను ఎగవేత వేసిన కేసులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు ఉన్నారని మండిపడ్డారు. అలాంటి వారిని పాలకమండ సభ్యులుగా ఎలా నియమిస్తారు? టిటిడి బోర్డు ఎందుకు రాజకీయ పునరావాసం కాకూడదో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వివరించాలని కోరారు.వేంకటేశ్వర స్వామి,మంగమ్మ దేవతలపై జోకులు వేసే నర్శిరెడ్డి ని…బూతులు మాట్లాడే ఏం.ఎస్ రాజు లను సభ్యులుగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి రూల్స్ ప్రకారం తమ బంధులును పాలక మండలి సభ్యులుగా నియమించరాదని చట్టంలో ఉందని పేర్కొన్నారు.అందుకు భిన్నంగా సభ్యుల నియామకం జరిగిందని ధ్వజమెత్తారు. దేవులపై అమితమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే సభ్యులుగా ఉండాలని చట్టం చెప్తుందని వివరించారు.