స్నికో మీటర్ ముఖ్యమా, డిఫ్లెక్షనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ టెస్టులో టీమిండియా బ్యాటర్ యశశ్వీ జైస్వాల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. స్నికో మీటర్ లో ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోయినా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా, ప్యాట్ కమిన్స్ డీఆర్ఎస్ కోరడంతో దానిని అవుట్ గా నిర్దారించారు. దాని మీద బ్యాటర్ కూడా అభ్యంతరం పెట్టినా అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఈ వ్యవహారం పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది. కొందరు అంపైర్లు స్నికో మీటర్ ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోతే నాటౌట్ గా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో కేవలం డిఫ్లెక్షన్ ఆధారంగా షాకిత్ సైకత్ తీసుకున్న నిర్ణయం మీద టీమిండియా మేనేజ్మెంట్ కూడా అసంతృప్తి ప్రదర్శిస్తోంది.

సరిగ్గా ఇదే పద్ధతిలో పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో రివర్స్ లో అవుట్ ఇచ్చారు. అప్పట్లో డిఫ్లెక్షన్ లేకపోయినా స్నికో మీటర్ లో అల్ట్రా ఎడ్జ్ గ్రాఫ్ ఆధారంగా అవుట్ గా ప్రదర్శించారు. విచిత్రంగా రెండు సార్లు టీమిండియాకే నష్టం జరిగింది.

మ్యాచ్ డ్రా చేసుకోవాలని టీమిండియా ప్రయత్నిస్తుండగా, విజయం కోసం ఆసీస్ యత్నిస్తున్న వేళ ఇది జరిగింది. దాంతో ఈ నిర్ణయం పెద్ద చర్చకు ఆస్కారమిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *