కేఎల్ రాహుల్ అవుటా, నాటవుటా, ఎందుకీ వివాదం?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గడ్డు పరిస్థితిలో పడింది. టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయింది. యంగ్ బ్యాటర్లు యశశ్వి జైశ్వాల్, పడిక్కల్ డకౌట్లుగా వెనుదిరగగా, ఆ తర్వాత కింగ్ కోహ్లీ కూడా స్వల్ప స్కోర్ కే అవుటయ్యాడు. కొంత సేపు రిషబ్ పంత్ తో కలిసి ప్రతిఘటించిన రాహుల్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి 51 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది.

లంచ్ కి కొద్దిసేపటికి ముందు పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ అవుట్ వివాదాస్పదంగా మారింది. అది నాట్ అవుట్ అనే వాదన బలపడుతోంది. ఇప్పటికే రాహుల్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బ్యాట్ ప్యాడ్స్ ను తాకినప్పుడు వచ్చిన సౌండ్ తో స్నికో మీటర్ ఆధారంగా డీఆర్ఎస్ లో తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరం వ్యక్తం చేశాడు.

కామెంటేటర్లు కూడా తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ కేఎల్ రాహుల్ అవుట్ కాదనే రీతిలో మాట్లాడడం విశేషం. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మారుస్తూ టీవీ అంపైర్ తీసుకున్న నిర్ణయం మీద పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి

ప్రస్తుతం క్రీజ్ లో రిషబ్ పంత్ తో కలిసి ధ్రువ్ జూరెల్ ఉన్నాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్లు క్రీజ్ లో కి వస్తారు. దాంతో స్కోర్ వంద పరుగులు చేరడం ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన బాధ్యత ఈ ఇద్దరు కీపర్ బ్యాటర్ల మీద ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *