ఆస్ట్రేలియాతో టెస్టులో టీమిండియాను ఆదుకున్న తెలుగోడు
ఆంధ్రా జట్టు ఆటగాడు ఆరంభ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల మధ్య టీమిండియా స్కోర్ 150 రన్స్ కి చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. తన ఆరంభ మ్యాచ్ లోనే జట్టు తరుపున హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కెరీర్ తొలి ఇన్నింగ్స్ లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 41 రన్స్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి కొంత సేపు ఆస్ట్రేలియన్ బౌలర్లను ప్రతిఘటించారు. చివరకు ఓ దశలో 49 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి ఈ ఇద్దరి బ్యాటింగ్ కారణంగా 150రన్స్ కి చేరింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తీయగా, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు చొప్పున దక్కించుకున్నారు.
కీలక బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే అవుటయిన మ్యాచ్ లో నితీశ్ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్, తొలిరోజు ఒత్తిడి మధ్య ప్రతిభ కనబరచడాన్ని పలువురు అభినందించారు. చక్కటి ఫుట్ వర్క్ తో కొట్టిన షాట్లు, జట్టుని ఆదుకోవడానికి తోడ్పడ్డాయని అన్నారు.
ఆల్ రౌండర్ కోటాలో జట్టులో చోటు సాధించిన నితీశ్ బౌలర్ గానూ సత్తా చాటాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.