ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు…