జోరు వాన, జారుతున్న బురదలోనూ పవన్ ముందుకే!
మన్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పనసభద్ర పంచాయతీ బాగుజోల వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న 19 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగబోతోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి…