చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….

Read More

బాహుబలిలో బిజ్జాలదేవుడిలా జగన్ కి సజ్జల అన్నట్టేనా, ఎందుకలా?

బాహుబలి గుర్తుంది కదా. అందులో బిజ్జలదేవుడి పాత్రనే సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్నారా.. ఎందుకో వైఎస్సార్సీపీ క్యాడర్ లో మెజార్టీ అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. అధికారంలో ఉండగా అన్నీ తానై అన్నట్టుగా చక్రం తిప్పిన సజ్జల తీరు మీద నోరుమెదపలేకపోయారు గానీ ఆ తర్వాత చాలా గగ్గోలు పెట్టారు. అయినా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వెంట సజ్జల మినహా మరొకరికి ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్…

Read More
babu pawan

చంద్రబాబుని పవన్ కళ్యాణ్‌ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్వయంగా పవన్ కళ్యాణ్‌ అంగీకరించారు. నిజానికి అలాంటి విమర్శలు విపక్షం నుంచి వస్తుంటాయి. దానిని పాలక కూటమి నేతలు తప్పుబడుతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా పరిస్థితి అదుపుతప్పిందని అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం చెప్పడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లక్ష్యం ఏమిటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. యధాలాపంగా ఆయన ఇంతటి తీవ్రమైన విమర్శలు చేసి ఉండకపోవచ్చన్నది అంగీకరించాల్సిన విషయం. అందులోనూ లా…

Read More

రెడ్ బుక్ మూడో చాప్టర్ అంటున్న లోకేశ్, ఈసారి కొడాలి నాని, వంశీ ఉంటారా?

ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో కూడా రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు. తను విపక్షంలో ఉండగా పలువురి పేర్లు రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రెడ్ బుక్ మూడో చాప్టర్ ఓపెన్ అవుతుందని వెల్లడించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు రెడ్ బుక్ పూర్తిగా ఓపెన్ కాలేదని పాలక టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అప్పట్లో…

Read More