జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర : రాచమల్లు
నందమూరి కుటుంబంలో జరిగినవే కారు ప్రమాదాలా? వైయస్ విజయమ్మ తన ప్రయాణంలో కారు టైర్లు ఉడిపోతే జగన్మోహన్ రెడ్డినే హత్య కు కుట్ర చేశారని ఆరోపణలు చేస్తారా? నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన ప్రయత్నం టీడిపి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైయస్ఆర్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు. బిడ్డల ఆస్తి వివాదాలను పరిష్కరించే బాధ్యత తనపై ఉందని విజయమ్మ చెబుతున్నారు. వైయస్ కుటుంబ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.సృష్టిలో తల్లిని కొడుకు చంపే కుట్ర ప్రయత్నం ఎవరు చేయరని గుర్తు చేశారు.తిరుమల కల్తీ లడ్డు ప్రసాదం, ప్రకాశం బ్యారేజి కోట్టుకోవపోవడానికి కుట్ర పన్నింది, రాష్ట్ర ఇతర సమస్యల్ని కూడా అన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ పై చంద్రబాబే విష ప్రచారం చేయించి ” ఎక్కడకి పోతున్నాం, ఇంత రాక్షసుడితోనే నేను రాజకీయం చేస్తుంది” అంటూ తేనే పూసిన కత్తి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఐదు నెలల్లో ఎన్నికలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలుచేసారా అని ప్రశ్నించారు.