శ్రేయస్ అయ్యర్ మళ్లీ అక్కడికే..!
వచ్చే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం శ్రేయస్ అయ్యార్ సిద్ధమవుతున్నాడు. ఇటీవల కేకేఆర్ రిటెన్షన్ లిస్టులో మనోడు పేరు లేదన్న సంగతి తెలిసిందే. దాంతో నెక్ట్స్ సీజన్ కోసం మెగా ఆక్షన్ లో అయ్యర్ ను ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
అయితే తాజాగా అయ్యర్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతోంది. డీసీ కూడా తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను రీటైన్ చేసుకోలేదు. పంత్ కోసం ఆర్సీబీ, సీఎస్కేలు పోటీ పడుతుండగా, శ్రేయస్ ను మళ్లీ సారధి చేసేందుకు డీసీ సిద్దమంటోంది.
గతంలో శ్రేయస్ అయ్యర్ దిల్లీ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ 2025 కోసం పాత జట్టువైపు పయనిస్తుండడం ఆసక్తికరం.
పంత్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకిరంచే అవకాశం ఉన్న శ్రేయస్ అయ్యర్ కోసం ఇప్పటికే డీసీ మేనేజ్మెంట్ జీఎంఆర్ గ్రూపు గట్టిగా ప్రయత్నిస్తుంది. కాబోయే కెప్టెన్ గా శ్రేయస్ కి హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.