జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు బడ్జెట్లలో నిధులు కేటాయించండి
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర.. బడ్జెట్లలో అవసరమైన మేరకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను తమ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ద్వారా కోరడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ ఏ జె)ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి తాము కేటాయింపులు కోసం వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నామన్నారు.. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు.. ఆరోగ్య ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా.. పెన్షన్ సదుపాయంలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరపాలన్నారు.. తమ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ద్వారా ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తామన్నారు. కేంద్రానికి జాతీయ జర్నలిస్టుల సంఘము (ఎన్ ఏ జె)తరఫున పాండే.. రాష్ట్రానికి తమ రాష్ట్ర కార్యవర్గం తరఫున తగు ప్రతిపాదనలు చేయనున్నట్లు వీరు చెప్పారు
అలాగే రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల బస్సు పాసుల కాలపరిమితి ముగిసినందున
మరో నెల రోజులు పాటు రెన్యువల్ చేయాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులను కోరినట్లు వివరించారు..శనివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవో హోంలో పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు వీరు చేతులు మీదుగా ఫెడరేషన్ (యూనియన్) గుర్తింపు కార్డులను అందజేశారు.. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూనూతన అక్రిడేషన్లు జారీకి మరో 10 నుంచి 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉందనీ కాబట్టి బస్సు పాసులు గడువు శనివారంతో ముగిసినందున మరో నెలరోజులు పొడిగిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదనీ సమాచార శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు.. ఈ విషయమై తగు నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు వీరు చెప్పారు.. పది రోజుల్లో అక్రిడేషన్లు జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా సమాచార శాఖ అధికారులు తమకు తెలియజేయడం జరిగింది అన్నారు.. తుది నిర్ణయం ఆ శాఖ డైరెక్టర్ నేడో .రేపో తీసుకునే అవకాశం ఉందని వీరు వివరించారు.. అలాగే గతంలో మాదిరిగా రైల్వే పాసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు..
తమ వినతిని కేంద్ర రైల్వే వర్గాలకు పంపుతామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.. జర్నలిస్టులు రైల్వే పాసులు కోసం
దశలవారీగా వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నామన్నారు.. అయితే కేంద్రం పరిధిలో అంశం కాబట్టి జాప్యం జరుగుతూ వస్తుంది అన్నారు.. జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు.. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు..బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి.. కింతాడ మదన్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్.. ఉపాధ్యక్షులు బొబ్బర ప్రసాద్.. పి నగేష్ బాబు.. రాజశేఖర్.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పసుపురెడ్డి నర్సింగరావు.. లక్ష్మణ్
తదితర సభ్యులంతా పాల్గొన్నారు..