రెడ్ బుక్ మూడో చాప్టర్ అంటున్న లోకేశ్, ఈసారి కొడాలి నాని, వంశీ ఉంటారా?
ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో కూడా రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు. తను విపక్షంలో ఉండగా పలువురి పేర్లు రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రెడ్ బుక్ మూడో చాప్టర్ ఓపెన్ అవుతుందని వెల్లడించారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు రెడ్ బుక్ పూర్తిగా ఓపెన్ కాలేదని పాలక టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అప్పట్లో తమను వేధించిన వారి మీద చర్యలు తీసుకోవడం లేదన్న ఆందోళన పలువురి నుంచి వ్యక్తమవుతోంది. ఈ దశలో అమెరికాలో నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేశ్ ఏకంగా మూడో చాప్టర్ కూడా మాట్లాడడం ఆసక్తిగా మారింది.
రెడ్ బుక్ పేరుతో ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారుల మీద చర్యలకు సిద్ధమయ్యారు. అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సహా సీనియర్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ వంటి వారు కేసుల్లో ఇరుక్కున్నారు. మరోవైపు బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్ వంటి నేతలు జైలు పాలయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి వారు ముందస్తు బెయిల్ తో గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో రెడ్ బుక్ మూడో చాప్టర్ లో ఎవరి పేర్లుంటాయన్న దానిపై చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని సహా పలువురు నేతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. లోకేశ్ కూడా దానికి పట్టుదలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ఉన్న పరిమితుల రీత్యా ఆచితూచి అడుగులేసే అవకాశం కనిపిస్తోంది. ఆ క్రమంలో మూడో చాప్టర్ అంటే ఎవరెవరి మీద యాక్షన్ కి దిగుతారన్నది కీలకమైన అంశంగా కనిపిస్తోంది.
నారా లోకేశ్ వర్సెస్ కొడాలి నాని
good move