దీపావళి హిట్ కొట్టేసిన ఆ మూడు సినిమాలు ఓటీటీలో ఎక్కడంటే..!

ఈసారి పండుగ సినీ ఇండస్ట్రీకి సంతోషాన్ని నింపింది. ఒకేసారి విడుదలయిన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం సినిమా క మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో పాటుగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ తో పాటుగా మళయాళీ యంగ్ హీరో దుల్కర్ సల్మన్ స్ట్రయిట్ మువీ లక్కీ భాస్కర్ సైతం మంచి రెస్పాన్స్ సాధించాయి. పాజిటివ్ గా ఓపెనింగ్స్ కనిపించాయి.

ఇప్పుడీ మూడు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడనే చర్చ మొదలయ్యింది. అయితే అందులో క సినిమా ఇంకా ఓటీటీ రైట్స్ కన్ఫర్మ్ కాలేదు. మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా రూ. 6.18 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కిరణ్‌ అబ్బవరం కెరీర్ లోనే పెద్ద హిట్ గా మారింది. ఈ సినిమాను నవంబర్ నెలాఖరు నాటికి ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. దానికోసం ఆహా ప్రయత్నిస్తోంది. ఆహాలో ఈ సినిమా ప్రసారమయ్యే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.

ఇక లక్కీ భాస్కర్, అమరన్ కూడా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతున్నాయి. అమరన్ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 34 కోట్లు రాబట్టింది. భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. వీకెండ్ లో ఈ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నెట్ ఫ్లెక్స్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

లక్కీ భాస్కర్ కూడా నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయబోతున్నారు. దుల్కర్ సల్మన్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా మొదటి రోజు సుమారు 13 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇలాంటి ఆసక్తికర కథనంతో ఇప్పటి వరకూ సినిమాలు రాకపోవడంతో బ్యాంకింగ్ ఫ్రాడ్ నేపథ్యంలోని కథకు ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. పాజిటివ్ టాక్ కారణంగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *