నయనతార బాటలో.. డైరెక్టర్ తో మరో హీరోయిన్ పెళ్లి!

మరో హీరోయిన్ పెళ్లికి సిద్దమవుతోంది. ఆమె కూడా సినీ దర్శకుడినే మనువాడబోతోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార కూడా సినీ దర్శకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బాటలో మరో కోలీవుడ్ హీరోయిన్ చేరుతోంది. రవీనా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

కోలీవుడ్‌లో డబ్బింగ్‌ తో మొదలైన రవీనా కెరీర్ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. లవ్ టుడే సినిమా హిట్ కావడంతో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. రవీనా తల్లి శ్రీజ కూడా పలు సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. ఉద‌య‌నిధి స్టాలిన్ హీరోగా వ‌చ్చిన మా మ‌న్న‌న్ సినిమాలో ఫ‌హ‌ద్ ఫాజిల్‌కు భార్య‌గా న‌టించి మంచి గుర్తింపును ద‌క్కించుకుంది.

‘వాలాట్టి’ పేరుతో మళయాళంలో వచ్చిన సినీ దర్శకుడు దేవన్ జయకుమార్ తో రవీనా ప్రేమాయణం సాగిస్తోంది. దానిని నిర్దారిస్తూ తాజాగా రవీనా తన లవర్ తో ఉన్న ఫోటోను ఇన్ట్సాలో షేర్ చేసింది. ఆ సినిమా సమయంలో వారి ప్రేమ చిగురించినట్టు చెబుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందన్న సంకేతం ఇవ్వడంతో రవీనా, దేవన్ కి వారి సన్నిహితులు, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువెత్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *