ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు
సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…