కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!
అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…