విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ కలిసి ఒకే టీమ్ కి ఆడబోతున్నారు..!

అవును.. నిజమే. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోపీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకే బీసీసీఐ సిద్ధంగా లేని దశలో పాకిస్తాన్ ప్లేయర్ తో కలిపి టీమిండియా ఆటగాడు ఆడడం ఏమిటనుకుంటున్నారా.. అదే జరగబోతోంది. ఇద్దరూ కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు.. పాకిస్తాన్, టీమిండియా నుంచి మరికొందరు ప్లేయర్లు కూడా ఆ టీమ్ లో ఉంటారు..

ఆఫ్రో ఆసియన్ కప్ మరోసారి నిర్వహించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించడంతో ఆసియన్ ఎలెవన్ జట్టులో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ సహా మరికొందరు ఆటగాళ్లు ఆడబోతున్నారు. బంగ్లాదేశ్, ఆప్ఘన్, శ్రీలంక జట్ల నుంచి కూడా ఈ టీమ్ లో ఉంటారు. దాంతో ఆసియన్ ఎలెవన్ జట్టులో కలిసి ఒకే జెర్సీలో బాబర్ అజామ్, కోహ్లీ కనిపించబోతున్నారన్న మాట.

2005లో ఈ టోర్నీని దక్షిణాఫ్రికా నిర్వహించింది. 2007లో ఇండియా లో జరిగింది. 2009 లో జరిగిన కెన్యా టోర్నీ అర్థాంతరంగా ఆగిపోయింది. సుమారుగా దశాబ్దంన్నర తర్వాత ఇప్పుడు నిర్వహించబోతున్నారు.

2005లో ఇంజిమామ్ కెప్టెన్ గా ఆసియన్ ఎలెవన్ జట్టు ఆడింది. ఆ జట్టులో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి వాళ్లు ఆడారు. ఆ తర్వాత 2007 టీమ్ లో గంగూలీ, ధోనీ, హర్బజన్, జహీర్ ఖాన్, యువరాజ్ , వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాల్లు ప్రాతినిథ్యం వహిచారు. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా తాజా ప్రతిపాదనకు బీసీసీఐ నుంచి పూర్తి సానుకూలత వ్యక్తమయితే మాత్రం ఆచరణ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. దానికి బీసీసీఐ సుముఖంగా ఉందంటూ ఆఫ్రికన్ క్రికెట్ ప్రతినిధులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *