కెప్టెన్ మీద కోపగించి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన క్రికెటర్..!

క్రికెట్లో చాలామందికి టెంపర్ మెంట్ ఉంటుంది. కొందరు దాన్ని ఫీల్డ్ లోనే ప్రదర్శిస్తారు. అలాంటిదే ఒకటి తాజాగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా బయటపడింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అనూహ్యంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ నిర్ణయం నచ్చలేదని డ్రెస్సింగ్ రూమ్ కి దారితీశాడు. దాంతో కొంతసేపు ఆ జట్టు పది మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.

వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తీరుతో జోసెఫ విబేధించి ఏకంగా గ్రౌండ్ వీడి వెళ్లిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. జోసెఫ్ తీరును పలువురు తప్పుబట్టారు. చివరకు రెండు మ్యాచ్ ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన తీరుకి క్రికెటర్ కూడా క్షమాపణ చెప్పాడు.

అయినప్పటికీ ఇలా గల్లీ క్రికెట్ మాదిరిగా ఓడీఐలో ఇలా వ్యవహరించడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *