చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది.

“మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది. ‘డయల్‌ యువర్‌ సీఎం’ పేరుతో చంద్రబాబు, వైఎస్సార్ వంటి వాళ్ల హయంలో ఈ కార్యక్రమం జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మన్‌ కీ బాత్, డయల్‌ యువర్‌ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు సీఎం సిద్ధమవుతున్నారు.

త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో/ వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *