రిషబ్ పంత్ కొత్త రికార్డు, శ్రేయస్ అయ్యర్ తో ఆషామాషా కాదు
ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపుతున్నాడు. ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పొతున్నారు. సెట్ 1లో ఉన్న రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పరమయ్యాడు. చివరి వరకూ దిల్లీ ఆర్ టీ ఎం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ మొత్తానికి ఎల్ఎస్జీ ఆఫర్ చేయడంతో పంత్ లక్నో టీమ్ సొంతమయ్యాడు.
అయితే అందరూ ఊహించిన విధంగా పంత్ కోసం సీఎస్కే, ఆర్సీబీ ఆసక్తి చూపకపోవడం విశేషం. కొంత సేపు ఎస్ఆర్ హెచ్ మాత్రం పోటీ పడింది. కానీ చివరకు పూరన్ తో కలిసి ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కీపర్లు ఎల్ఎస్జీ లో చేరినట్టయ్యింది. కేఎల్ రాహుల్ మాత్రం కేవలం 14 కోట్లకే దిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు. సీఎస్కే కూడా కొంతసేపు పోటీ పడినప్పటికీ పంత్ ఎల్ఎస్జీ వైపు వెళ్లడంతో కేఎల్ రాహుల్ ఇటు వచ్చినట్టయ్యింది.
అంతకుముందు శ్రేయస్ అయ్యర్ కోసం గట్టి పోటీ జరిగింది. పంజాబ్, దిల్లీ జట్లు పోటాపోటీగా అయ్యర్ కోసం ప్రయత్నించాయి. దాంతో చివరకు 26.75 కోట్లకు అయ్యర్ ను పంత్ సొంతం చేసుకుంది. దాంతో ఐపీఎల్ నెక్ట్స్ సీజన్ కోసం పంజాబ్ కెప్టెన్ గా అయ్యర్, ఎల్ఎస్జీ సారధిగా రిషబ్ పంత్ ఖాయమయ్యారు.
తొలుత అర్షదీప్ ను 18 కోట్లకు పంజాబ్ సూపర్ కింగ్స్ ఆర్టీఎం ద్వారా సొంతం చేసుకుంది. రబాడాను 10.75 కోట్లకు గుజరాత్ జెయింట్ దక్కించుకుంది. జోస్ బట్లర్ ను కూడా జీటీ సొంతమయ్యాడు. రూ. 15.75 కోట్లకు బట్లర్ గుజరాత్ టీమ్ లో చేరబోతున్నాడు.
మిచెల్ స్టార్క్ ను డీసీ దక్కించుకుంది. 11 కోట్లకు ఈ ఆసీస్ బౌలర్ తన పూర్వ టీమ్ లో చేరబోతున్నాడు. లియామ్ లివింగ్ స్టన్ ను ఆర్సీబీ 17.5 కోట్లకు దక్కించుకుంది.
మహమద్ షమీని ఎస్ఆర్హెచ్ 10కోట్లకు దక్కించుకుంది. చాహల్ ను 18 కోట్లకు పీబీకేఎస్ , సిరాజ్ ను 12.25కి జీటీ దక్కించుకున్నాయి.