యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది.
ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు.
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ సరసన జైశ్వాల్ పేరు చేరింది.
అంతేగాకుండా ఇప్పటికే నాలుగో సెంచరీ సాధించిన యశశ్వి ప్రతీ సెంచరీని 150 మార్క్ చేరుకోవడం మరో రికార్డ్.
తొలుత కేఎల్ రాహుల్ తో కలిసి 200 రన్స్ పార్టనర్ షిప్ నమోదు చేసిన జైశ్వాల్ ఆతర్వాత పడిక్కల్ తో 50 రన్స్ పార్టనర్ షిప్ నమోదు చేసి టీమిండియా ఆధిక్యం 300 రన్స్ దాటించాడు. కోహ్లీతో కలిసి కదం తొక్కుతూ 150 మార్క్ దాటేశాడు. కొత్త బాల్ తీసుకుని స్టార్క్, హేజిల్ వుడ్, కమ్మిన్స్ ఎంత ప్రయత్నించినా జైశ్వాల్ తన జైత్రయాత్ర కొనసాగించడం విశేషం.
చివరకు 161 రన్స్ చేసిన మిచెల్ మార్ష్ బౌలింగ్ లో అవుట్ అయిన జైశ్వాల్ వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో 3 భారీ సిక్సులు, 15 ఫోర్లున్నాయి. అప్పటికే టీమిండియా 359 రన్స్ ఆధిక్యంలో ఉంది.