ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?
ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.హామి మేరకు ఉచిత బస్సు ప్రయాణం ను అమలులోకి తీసుకువచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయం తరువాత ఆ ఫార్ములా ను తెలంగాణ పై ఆ పార్టీ ప్రయోగించింది. అదే ఏడాది నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి సరిపడా స్థానాలు మాత్రమే సాధించింది.ఉచిత బస్సు ప్రయాణం హామి గ్రామీణ ఓటర్లుపై బాగా ప్రభావం చూపించింది.ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాటి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి హామి మేరకు…సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తరువాతనే ఉచిత బస్సు ప్రయాణం హామిని అమలులోకి తీసుకువచ్చారు.మొదట్లో ఆటో డ్రైవర్లు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన్నప్పటకి ప్రభుత్వం వెనకడుగు వేయలేదు.ఆటో డ్రైవర్లుకు ప్రత్యామ్నాయం చూపిస్తామని ప్రభుత్వం వారికి హామి ఇచ్చ్చి ఆందోళనను విరమింపచేసింది.
బస్సు ప్రయాణంపై వాయిదాల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఇదే హామీని ఇచ్చింది.ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అవుతున్న హామి వాస్తవంలోకి రాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్య సాధ్యాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మొదటగా ప్రకటించించిది.కానీ అది సాధ్యం కాలేదు.రానున్న బడ్జెట్ లో అసలు ఈ పథకానికి కేటాయింపులు ఉంటాయా? ఆటో డ్రైవర్లు కు ప్రత్యామ్నాయం ఏమిటి ? ఉచిత బస్సు ప్రయాణంకు సరిపడా బస్సులు ఉన్నాయా? విధి విధానాలు ఏమిటి? పలు ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లేవు.
మెలిక పెట్టిన డికె శివ కుమార్
కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డికె శివ కుమార్ ఉచిత బస్సు ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలు టిక్కెట్ కొనుక్కునే ప్రయాణం చేస్తామని వారే స్వయంగా చెబుతున్నారు.పథకం అమలుపై పున : సమీక్ష నిర్వహిస్తామని అన్నారు.దీనిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ కలలోకి వచ్చి మహిళలు ఏమైనా చెప్పారా అంటూ విరుచుకుపడ్డారు.ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పై కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ లో ఏ ఒక్కటి అయిన అమలు అయ్యిందా అని వైసిపి ప్రశ్నలు సంధిస్తోంది.ఉచిత హామీలు మంచిదే కానీ..రాష్ట్రాన్ని ఆర్థిక ఊబిలోకి నెట్టే విధంగా ఉండకూడదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ కు పొరుగున ఉన్న తమిళనాడు,కర్ణాటక,తెలంగాణలో మహిళలకు బస్సు ప్రయాణం అమలులో ఉంది. సిఎం చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారా ? వెనకడుగు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.