పుష్ప2 కోసం అల్లు అర్జున్ తో చిందేయబోతున్న శ్రీలీల, మరి సమంత?
ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటింగ్ గా క్రేజీ సీక్వెల్ సినిమా ఏది అంటే “పుష్ప 2” అనే చెబుతారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు హీరోగా దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమాగా ఇది రాగ భారీ విజయాన్ని సాధించి ఇపుడు పార్ట్ 2 కి ఎనలేని హైప్ ని తెచ్చుకుంది. పార్ట్ 1 ఎండింగ్ లో ఒక కేజీయఫ్, బాహుబలి లాంటి ఎగ్జైటింగ్ ఎండింగ్ లేకపోయినప్పటికీ పుష్ప 2 కి వాటికి మించిన బిజినెస్ జరుగుతుంది.
ఇలా సుమారు 1000 కోట్ల బిజినెస్ ని ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులుగా చేస్తూ సినీ వర్గాల్లో సంచలనంగా నిలిచింది. అయితే పార్ట్ 2 పై ఈ హైప్ చూసి మేకర్స్ కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా చేస్తున్న ఈ భారీ సినిమాలో ఐటెం సాంగ్ ఎవరితో అనేది కొన్ని నెలల నుంచి అలా మంచి సస్పెన్స్ గానే నిలిచింది.
కాగా మొదటిలో బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లే ఎక్కువగా వినిపించాయి. నార్త్ హాట్ బ్యూటీస్ జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రి పేర్లు ముందు బాగా హైలైట్ కాగా వారు తర్వాత సెన్సేషనల్ బ్యూటీ స్త్రీ 2 నటి శ్రద్దా కపూర్ పేరు వినిపించింది. అయితే శ్రద్ధా పేరు ఆల్ మోస్ట్ ఖరారు అని అనుకునే సమయంలో ఆమె అందుబాటులో లేకపోవడంతో టాలీవుడ్ హీరోయిన్ కే ఛాన్స్ దక్కినట్టుగా ఇపుడు వార్తలు బయటకి వచ్చాయి.
కాగా తెలుగులో ప్రెజెంట్ సెన్సేషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల డాన్స్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్స్ పరంగా ఒక డైనమైట్ లా ఆమె చేస్తుంది. ఇక అల్లు అర్జున్ డాన్స్ కోసం కూడా చెప్పాలిన పని లేదు. ఈ మధ్య కాలంలో అంతో ఇంతో డాన్స్ చేసాడు అంటే అది పుష్ప లోనే ఉంది.
ఇలా ఈ క్రేజీ కాంబినేషన్ పుష్ప 2 కోసం పడుతుంది అని వచ్చిన వార్తల లోపే ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్స్ ఈ సాంగ్ లో ఉంటారు అని ఫ్రెష్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అది కూడా ఈసారి సాంగ్ లో శ్రీలీలతో పాటుగా సమంత కనిపిస్తుంది అంటూ ఈ రూమర్స్ చెబుతున్నాయి. కన్నడ సినీ వర్గాల్లో కూడా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో సమంత, శ్రీలీల ఇద్దరూ చిందేయనున్నారట.
దీనితో థియేటర్స్ లో మాత్రం డబుల్ బ్లాస్టే అని చెప్పాలి. ఆల్రెడీ సామ్ ఫస్ట్ సినిమా ఐటెం సాంగ్ లో చేసిన సంగతి తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. మరి పుష్ప 2 కోసం మళ్ళీ తీసుకురావడం అంటే అది మరింత స్పెషల్ అనే చెప్పాలి. అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు హీరోయిన్స్ కి కలిపి ఓ ట్యూన్ అందులో ఊ అంటావా కూడా మిక్స్ చేస్తే జాతరే అని చెప్పాలి. మరి సామ్ ప్రెజెన్స్ కూడా ఉందా లేదా అనేది మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసమే అంతా ఆసక్తిగా వినిపిస్తుంది.