కేంద్రం నుంచి అనుమతులు వస్తే విశాఖ మెట్రో!

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్ర‌శ్నోత్త‌రాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన స‌మాధానమిచ్చారు.

“ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తాం. గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌,విజ‌య‌వాడ‌కు మెట్రో రైల్ రాకుండా క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింది. విశాఖ‌లో భోగాపురం ఎయిర్ పోర్టు వ‌ర‌కూ పొడిగించాల‌నే సాకుతో డీపీఆర్ ను నిర్ల‌క్ష్యం చేసింది. కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మెట్రో ప్రాజెక్ట్ పై స్వ‌యంగా కేంద్రమంత్రిని క‌లిసాను. సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌ధాని మోడీకి లేఖ రాసారు.విశాఖ‌ప‌ట్నంలో మొత్తం 76.90 కిమీ మేర రెండు ఫేజ్ ల‌లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో నిర్మాణం చేప‌డ‌తాం”. అంటూ వివరించారు.

అయితే నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు తగ్గట్టుగా మెట్రో విస్తరణ, వేగవంతంగా పనులు చేపట్టడం, ప్రాజెక్టు సహాయం కోసం 100 శాతం కేంద్రమే నిధులు వెచ్చించేలా ప్రయత్నించడం వంటి పలు సూచనలు విశాఖ నగర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *