బంగ్లా అనిశ్చితి ఇండియాకు కలిసొచ్చింది.. ఎందులో తెలుసా?
ఇండియా టెక్ట్స్ టైల్ మార్కెట్ పుంజుకుంటోంది.. కారణమదే
రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో చమురు ధరలు అదుపులోకి వచ్చాయి. అంతేగాకుండా దేశం నుంచి భారీగా ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి. అనూహ్యంగా ప్రస్తుతం యూరప్ కి ఆయిల్ ఎగుమతిదారుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి యూరప్ కి ఎగుమతి చేయడం ద్వారా ఇండియా భారీగా లాభాలు అర్జిస్తోంది.
అదే సమయంలో బంగ్లాదేశ్ పరిణామాలతో కూడా ఇండియాకు ఉపయోగం కనిపిస్తోంది. సరిహద్దుల్లో సఖ్యత లేమి కొంత చేటు తెచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ వ్యాపారపరంగా బంగ్లాదేశ్ లో అనిశ్చితి కలిసివస్తోంది. ముఖ్యంగా దుస్తుల ఎగుమతిలో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. దాంతో 2025లో 9-11 శాతం వరకూ వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక్రా రేటింగ్స్ ప్రకారం భారతీయ రెడీమేడ్ దుస్తులకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి కారణంగా అనేక కంపెనీలు ఇండియన్ మేడ్ రెడీ మేడ్ డ్రస్సులకు ఆర్డర్లు ఇస్తున్నాయి. దాంతో ఇది ఉపయోగపడే అంశంగా కనిపిస్తోంది.